11 గంటలకు 10 ప్రశ్నలతో సిద్ధం!... అల్లు అర్జున్ ని థియేటర్ కి తీసుకెళ్తారా?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-24 04:50 GMT

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు (మంగళవారం - 24 డిసెంబర్) హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో.. అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో సమావేశమై చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. మరోపక్క అల్లు అర్జున్ ని థియేటర్ కు తీసుకెళ్తారా అనే చర్చ తెరపైకి వచ్చింది!

అవును... సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఏ11 గా ఉన్న అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరుకానున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆయన తన లీగల్ టీమ్ తో సమావేశమై చర్చిస్తున్నారని అంటున్నారు. వారితో కలిసే 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఈ సమయంలో... అల్లు అర్జున్ విచారణ నిమిత్తం పోలీసులు సుమారు 10 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. ఇదే సమయంలో... అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ కు తీసుకెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం అవసరమైతే అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్ వద్దకు పోలీసులు తీసుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు సంధించే అవకాశం ఉన్నట్లు చెబుతున్న 10 ప్రశ్నల్లోనూ... ఇటీవల సీఎం అసెంబ్లీలో మాట్లాడిన అనంతరం మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలపైనా విచారించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అల్లు అర్జున్... థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడూ తనను ఏ పోలీసూ కలవలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ ను విచారించేది వీరేనా?:

అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాల్సి ఉండగా.. ప్రస్తుతం తన లీగల్ టీమ్ తో చర్చిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో... సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అల్లు అర్జున్ ను చిక్కడపల్లి ఏసీపీ రమేష్, సీఐ రాజు నాయక్ విచారించనున్నారని అంటున్నారు.

‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ ను ఏ11 గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క నాలుగు వారాల వరకూ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఈ నేపథ్యంలో.. అల్లు అర్జున్ కు నిన్న చిక్కడపల్లి పోలీసులు బీ.ఎన్.ఎస్. 35 (3) కింద నోటీసులు ఇచ్చారు. దీంతో.. 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉండగా.. సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం సంధ్య థియేటర్ వద్దకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉందనే చర్చ తెరపైకి వచ్చింది.

Tags:    

Similar News