కీలక నిర్ణయాన్ని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. సర్కారీ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం (ఈ ఏడాది జూన్ నుంచి మొదలయ్యే) నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. తెలంగాణ గురుకులాలు మంచి ఫలితాల్ని అందిస్తున్న నేపథ్యంలో.. గ్రామ స్థాయిల్లో నుంచి విద్యార్థులు గురుకులాల్లోచేరుతున్నట్లుగా అభిప్రాయపడిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక్కడ అనుసరిస్తున్న విధానాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రామస్థాయి నుంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని ప్రభుత్వం చెబుతోంది.
సోమవారం సుదీర్ఘంగా సాగిన తెలంగాణ మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. దీనికి దారి తీసిన కారణాల మీద సుదీర్ఘ చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టటానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న మార్పులేనని ప్రభుత్వం చెబుతోంది.
వ్యవసాయంతో పాటు ఇతర అనుబంధ రంగాలు బలోపేతం కావటంతో గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని.. పల్లెల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల చదువు.. భవిష్యత్తు పట్ల ఆలోచనలు పెరిగినట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో గ్రామాల్లో ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధనకు డిమాండ్ పెరిగిందని పేర్కొంది. తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఇంగ్లిషు మీడియం ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని రాష్ట్ర కేబినెట్ భావిస్తోంది.
రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వం స్కూళ్లను తీర్చిదిద్దాలని విద్యాశాఖను ఆదేశించింది. అంతేకాదు.. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలు.. జూనియర్.. డిగ్రీ కళాశాలల్లో ఫీజులనియంత్రణ చట్టాన్నితెచ్చేందుకు వీలుగా నిర్ణయాన్ని తీసుకున్నారు. ముసాయిదా చట్టరూపకల్పనకు సంబంధించి ముసాయిదాను సిద్ధం చేయనున్నారు. దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు రూపంలో పెట్టనున్నారు.దీని ద్వారా కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. అంతేకాదు.. ఈ అంశంపై అధ్యయనానికి విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిషు మీడియంలో బోధన కోసం టీచర్లకు శిక్షణ ఇవ్వటం.. స్కూళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దటం..విద్యార్థుల్లో ఉత్సాహం కలిగించేలా ప్లే గ్రౌండ్స్ తో పాటు ఇతర వసతుల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాణ్యమైన ఇంగ్లిషు విద్యను అందించటం ద్వారా ప్రైవేటు కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని.. అందుకుతగిన ప్రణాళికల్ని సిద్ధం చేయాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. ఇందుకోసం విద్యాశాఖలో ‘మన ఊరు మన బడి’ అనే వినూత్న కార్యక్రమానికి మంత్రివర్గం ఓకే చెప్పింది.
తెలంగాణ రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ.. స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 19.84 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య.. ఎన్ రోల్ మెంట్.. అటెండెన్స్.. వారు ఆ స్కూళ్లలోకొనసాగించేందుకు వీలుగా దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన.. పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7.,289 కోట్లతో మన ఊరు - మన బడి ప్రణాళికకు ఆమోదం తెలిపారు.
రెండేళ్ల వ్యవధిలో రూ.4వేల కోట్లతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ.. నాణ్యమైన విద్యను అందించే దిశగా కార్యక్రమాలు చేపడతారు. ఈ కార్యక్రమ అమలు.. విధి విధానాల రూపకల్పన కోసం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి.. కేటీఆర్.. హరీశ్ రావు.. ఎర్రబెల్లి దయాకర్ రావుతో కూడిన మంత్రుల బృందం గత ఏడాది మార్చి 23న, ఏప్రిల్ 8న, జూన్ 17న సమావేశమైంది. పలు అంశాల్ని పరిశీలించిన విధి విధానాల్ని రూపొందించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర విద్యా బోధనకు సంబంధించిన సమూల మార్పునకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెప్పాలి.