ఎన్టీయార్ తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఖ్యాతి. ఈ విషయంలో వేరే విధంగా ఎవరూ చెప్పలేరు కూడా. ఆయన అత్యంత ప్రభావిత రంగాలైన రెండు రంగాలను ఏలారు. రెండింటా ఘన విజయం సాధించారు. ఆయన సినిమా నటుడుగా నంబర్ వన్. అలాగే రాజకీయ నాయకుడిగా కూడా అగ్రస్థానంలోనే వెలిగారు. ఇవన్నీ ఇలా ఉంటే ఆయన సినీ జీవితం మూడున్నర దశాబ్దాల కాలం అయితే రాజకీయ జీవితం మొత్తంగా పద్నాలుగేళ్ళు.
ఆయన సినిమా జీవితంలో పెద్దగా వివాదాలు లేవు. ఇక రాజకీయ జీవితంలో చూస్తే కొన్ని అలా కనిపిస్తాయి. ఆయన 1982లో పార్టీ పెట్టి 1983లో గెలిచారు. 1984లో అంటే ఏడాదిన్నర కాలంలోనే తొలి వెన్నుపోటుకు గురి అయ్యారు. ఆ తరువాత ఉమ్మడి ఏపీ అంతట తిరిగి అతి పెద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నిర్వహించి నాటి ఉక్కు మహిళ , భారత ప్రధాని ఇందిరాగాంధీ చేతనే తిరిగి అధికారాన్ని అందుకున్నారు. అలా గ్రేట్ లీడర్ అని కూడా పిలిపించుకున్నారు.
ఇక 1994లో ఆయన మూడవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి ఎనిమిది నెలలకే ఆయన చేతిలో అధికారం పోయింది. దాని వెనక ఆయన కుటుంబమే ఉంది. ఈసారి ఆయన నుంచి అధికారంతో పాటు పార్టీని కూడా లాగేసుకుని చిన్నల్లుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా 1995 ఆగస్టులో జరిగింది.
ఆ తరువాత కేవలం నాలుగున్నర నెలలు మాత్రమే ఎన్టీయార్ బతికారు. ఆయన 1996 జనవరి 18న కన్నుమూశారు. ఇదిలా ఉంటే ఎన్టీయార్ ని విపరీతంగా అభిమానించేవారు కూడా ఎన్టీయార్ అనే బుక్ లో చివరి పుటలను తొలగించాలని కోరుకుంటారు. ఒక మహానుభావుడి విషయంలో జరగకూడని అపచారం జరిగిపోయింది అని కూడా అంటారు.
అయితే ఎవరు తొలగించాలనుకునా అది కుదిర వ్యవహారం కాదు, ఎన్టీయార్ అనే పుస్తకం లో మొత్తం 73 పేజీలు ఉంటే అందులో డెబ్బై పేజీలు మాత్రమే ఉంచాలని ఆ మూడు పేజీలు వద్దు అంటే చరిత్ర ఒప్పుకుంటుందా. ఇక ఎన్టీయార్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించింది 1993లో, ఆమె అతని రెండవ భార్యగా ఆ ఏడాది వచ్చారు. అంటే అక్కడ నుంచి చూస్తే గట్టిగా రెండున్నరేళ్ళు ఎన్టీయార్ బతకలేదు.
ఈలోగానే ఎన్నికలు రావడం, ఆయన ముఖ్యమంత్రి కావడం, మళ్లీ పదవి పోగొట్టుకుని మాజీ కావడం, చివరికి ఈ లోకాన్ని వీడుతూ శాశ్వతంగా వెళ్ళిపోవడం అన్నీ జరిగిపోయాయి. ఎన్టీయార్ అంటే ఒక లెజెండ్. అయినా సరే చివరి రోజులలో మాత్రం ఆయన పడిన బాధలు ఇబ్బందులు అన్నీ కూడా చరిత్ర పదిలంగానే దాచి ఉంచింది.
ఎన్టీయార్ గురించి చెప్పుకుంటూ అక్కడిదాకా వచ్చి చివరి పేజీల దగ్గర ఎవరైనా ఆగిపోతే మాత్రం ఆ బుక్ ని పూర్తిగా చదవనట్లే. ఇక ఎన్టీయార్ అన్న బిగ్ ఫిగర్ ని ఈ జాతి తొలిసారిగా చూసింది. మళ్ళీ ఆ మహానుభావుడు వస్తారా అంటే చెప్పడం డౌటే. అలాగే ఆయనకు చివరి రోజులలో జరిగిన అవమానాలు ఎవరికీ ఇక ముందు జరగబోవు అని కూడా చెప్పాల్సి ఉంటుంది.
ఇక్కడ ఒక్క విషయం గట్టిగా చెప్పుకోవాలి. కాలం గొప్పది. అది అందరి చరిత్రలను జాగ్రత్తగా రాస్తుంది. మనిషి ఆ అనంతకాలంలో ఇక చిన్న బిందువు. ఆ మనిషికి ఇష్టాఇష్టాలు ఉంటాయి. నచ్చినవీ నచ్చనివీ ఉంటాయి. కానీ కాలం ఇచ్చే తీర్పు కఠినమైనది. అది అద్దంలా అన్నీ చూపిస్తుంది. అక్కడ అన్నీ నిజాలే కనిపిస్తాయి.
రేపటి తరానికి ఎన్టీయార్ ఏమిటి అన్నది మొత్తం డెబ్బై మూడు పేజీల పుస్తకం చూపెడుతుంది. ఆయనకు ఆయనకు తీరని అన్యాయం జరిగింది అన్న నగ్న సత్యాన్ని కూడా లోకానికి ఎలుగెత్తి చాటుతుంది. అందుకే చరిత్ర రాసే రికార్డుని తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ప్రతీ ఏటా ఆయన జయంతి వేళ ఆయన విఖ్యాతితో పాటు ఆయనకు జరిగిన వెన్నుపోటును కూడా కాలం గుర్తు చేస్తూనే ఉంటుంది.