కరోనా వైరస్ పుట్టుకకి కారణమైన చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఉత్పత్తి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ని తీసుకోనే వారికి , తీసుకున్న విదేశీయులకు మాత్రమే చైనాలోకి అనుమతి ఉంటుంది అని సంచలన ప్రకటన చేసింది. అమెరికా, ఇండియా, పాకిస్తాన్ సహా కొన్ని దేశాల వారిని అనుమతించేందుకు సరిహద్దు ఆంక్షలను కాస్త సడలిస్తామని యూఎస్ లోని చైనా ఎంబసీ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఈ దేశం గత ఏడాది మార్చి నుంచి తమ దేశంలోకి విదేశీయుల రాకను నియంత్రిస్తోంది. అయితే, ఇప్పుడు చాలావరకు కరోనా వైరస్ ని కట్టడి చేయగలిగింది.
మా వ్యాక్సిన్లను తీసుకున్న విదేశియులను ఎంపిక చేసుకునేందుకు వీసా దరఖాస్తులను ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తామంటూ పలు దేశాల్లోని చైనా ఎంబసీలు నోటీసులు ఇచ్చాయి. మా దేశంలో మళ్ళీ తమ పనులు చేపట్టేవారికి, వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేవారికి , లేదా మా దేశంలో ఉన్న మీ కుటుంబాలను కలుసుకోగోరేవారికి ఈ వారం నుంచి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ముఖ్యంగా అమెరికాలోని చైనీస్ రాయబార కార్యాలయం వెల్లడించింది. చైనాలో ఇప్పటివరకు నాలుగు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగం కోసం అందుబాటులోకి తెచ్చారు. వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి 14 రోజులముందు వీరు కనీసం ఒక డోసు లేదా రెండు డోసులు తీసుకుని ఉండాలని చైనా అధికారులు స్పష్టం చేశారు.
రెండు వారాల క్రితం ఫిలిప్పీన్న్ చైనా నుంచి 6 లక్షల డోసుల వాక్సిన్ అందుకుంది. అయితే ఇండియా, శ్రీలంక తదితర కొన్ని దేశాల్లో చైనా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఇప్పుడు తమ టీకామందులను విస్తృతం చేసేందుకు చైనా ఇలా వీసాలకు, వ్యాక్సిన్లకు ముడిపెట్టింది. దీనితో భారత్ కి చెందిన దాదాపుగా 23 వేల మంది విద్యార్థులు చైనా లో వివిధ కోర్సులు చేస్తున్నారు. వారికీ ఈ వార్త బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.