తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అప్పుడప్పడు కాస్త చిత్రంగా మాట్లాడతారు. పేరుకు సీనియరే అయినా.. ఆయన మాటల్లో చురుకు కాస్త తక్కువగా కనిపిస్తుంటుంది. పాయింట్ మాట్లాడతారే కానీ.. సబ్జెక్ట్ పెద్దగా కనిపించదు. ఏదో మాట్లాడామంటే మాట్లాడమన్నట్లుగా ఉంటుందే తప్ప.. తాను చెప్పిన విషయం గురించి వెనక్కి తగ్గకుండా పోరాటం చేయటానికి తాను సిద్ధమన్న భరోసా కల్పించేలా ఆయన వైఖరి ఉండదు.
తాజాగా అన్నవరం వెళ్లిన ఆయన.. అక్కడి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏడాది తర్వాత తెలంగాణ అధికారపక్షం నుంచి వలసలు ఉంటాయని.. అది కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆశ ఉండటంలో తప్పు లేదు కానీ.. ఎంత పెద్ద పేరాశో అంటున్నారు ఎర్రబెల్లి మాటలు వింటున్నారు. అంటే.. పార్టీకి వెన్నుపోటు పొడిచి.. తమ దారిన తాము పోయిన వాళ్లు.. మళ్లీ పార్టీలోకి వస్తామంటే బొట్టు పెట్టి.. ఘనంగా స్వాగతం పలుకుతారా? మాటలు చెబుతున్నారు కానీ.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అంత సీన్ ఉందా..?