ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్ ఇస్తూ పార్టీ నుంచి వీడి.. తెలంగాణ అధికారపక్షంలో తాజాగా చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడారు. తనతో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ను తీసుకెళ్లిన ఆయన.. చంద్రబాబు అంటే ఇష్టం ఉన్నా తెలంగాణలో పార్టీ బతకదని తేల్చేశారు. భావోద్వేగంతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజల కోసమే తాను టీఆర్ఎస్ వెంట వెళుతున్నట్లు స్పష్టం చేశారు.
ప్రజలు టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని.. ఆ విషయం తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో స్పష్టమైందన్న ఎర్రబెల్లి.. తాను అధికారపార్టీలో చేరానని.. మిగిలిన నాయకులు.. కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ లోకి చేరిపోవాలని పిలుపునివ్వటం గమనార్హం. అదే సమయంలో తాను తీసుకున్న నిర్ణయంపై నాయకులు.. కార్యకర్తలు క్షమించి సహకరించాలని కోరటం విశేషం.
ఆరుసార్లు ఎమ్మల్యేగా బాధ్యతలు నిర్వర్తించిన తాను అనేక పదవుల్ని చేపట్టానని.. తనకు పదవులు ముఖ్యం కాదని.. టీఆర్ఎస్ సర్కారులో కీలక పదవులు చేపట్టేందుకు తాను ఎలాంటి హామీలు పొందలేదని చెప్పటం గమనార్హం. ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉండేటట్లు అయితే.. ప్రజలు తీర్పిచ్చినట్లు విపక్ష నేతగా తన బాధ్యత నిర్వర్తించాలన్న విషయాన్ని ఎర్రబెల్లి ఎందుకు మర్చిపోయారో..?