మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ ఇంటికి వెళతాడంట‌

Update: 2015-10-19 09:06 GMT
నోరు జార‌టం.. ఆపై కిందామీదా ప‌డ‌టం ఈ మ‌ధ్య కాలంలో ఒక అల‌వాటుగా మారింది. ఇష్టారాజ్యంగా మాట్లాడేసి.. వివాదాస్ప‌దంగా మారిన త‌ర్వాత మీడియా మీద‌నో.. మ‌రొక‌రి మీద‌నే ప‌డిపోయి.. తమ వ్యాఖ్య‌ల్ని త‌ప్పుగా అర్థం చేసుకున్నాయ‌ని.. వ‌క్రీక‌రించాయ‌ని మాట్లాడే నేత‌ల‌కు కొద‌వ‌లేదు.

క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రుగుతున్న అత్యాచారాల‌కు ప్ర‌తిప‌క్షంగా మీ బాధ్య‌త ఏమిటన్న ప్ర‌శ్న‌కు.. మ‌హిళ జ‌ర్న‌లిస్టుతో క‌ర్ణాట‌క మాజీ డిప్యూటీ సీఎంగా వ్య‌వ‌హ‌రించిన ఈశ్వ‌ర‌ప్ప అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. నిన్ను ఎవ‌రైనా కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తే నేనేమి చేయ‌గ‌ల‌నంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వైనం తీవ్ర దుమారం చెల‌రేగింది. తాను ఎంత‌లా నోరు జారార‌న్న విష‌యం అర్థ‌మైన ఈశ్వ‌ర‌ప్ప న‌ష్ట‌నివార‌ణ కోసం ఎంత‌లా ప్ర‌య‌త్నించినా.. సొంత పార్టీ నేత‌లు సైతం త‌లంటు పోస్తున్న ప‌రిస్థితి. దీంతో.. ఆయ‌న మ‌రోసారి మీడియాతో మాట్లాడుతూ.. తాను మాట్లాడిన మాట‌లు ఎవ‌రికైనా బాధ‌ను క‌లిగించి ఉంటే క్ష‌మించాల‌ని.. తాను స‌ద‌రు మ‌హిళా జ‌ర్న‌లిస్టు ఇంటికి స్వ‌యంగా వెళ్లి సారీ అడుగుతాన‌ని చెబుతున్నారు.

ప‌వ‌ర్ లో లేకున్నా పొగ‌రు మాత్రం త‌గ్గ‌ని ఈశ్వ‌ర‌ప్ప లాంటి నేత‌లు అవ‌స‌ర‌మైతే కాళ్లు ప‌ట్టుకోగ‌ల‌రు.. అవ‌స‌రం తీరాక కాళ్లు లాగేయ‌గ‌ల‌రు. అనాల్సిన మాట‌ల‌న్నీ అనేసిన త‌ర్వాత‌..ఎంత గింజుకుంటే మాత్రం ఏం లాభం. నోటి వెంట మాట పెద‌వి జార‌కుండానే చూసుకోవాలి మ‌రి.
Tags:    

Similar News