వాళ్లను దాటాలని చూస్తే.. పార్టీలో పతనమేనట!

Update: 2019-09-29 06:55 GMT
వివాదాస్పద వ్యాఖ్య చేశారు కర్ణాటక రాష్ట్ర మంత్రి ఈశ్వరప్ప. యడ్డి సర్కారులో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిగా పని చేస్తున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఎంతటి వారికైనా పార్టీనే ముఖ్యమని.. పార్టీ నిర్ణయాల్ని తూచా తప్పకుండా పాటించాల్సిందేనన్నారు. ఒకవేళ పార్టీని అధిగమించాలని చూస్తే పతనం తప్పదన్నారు.

ఇది పార్టీ వరకే పరిమితం కాదని.. ఆయా పార్టీల్లో కొందరు అధినేతలకు మించి వెళ్లాలనుకోకూడదని చెప్పారు. కాంగ్రెస్ లో సిద్దరామయ్య.. బీజేపీలో యడియూరప్ప.. జేడీఎస్ లో కుమారస్వామి ఉండొచ్చన్న ఈశ్వరప్ప.. వారిని అధిగమించాలని ఆయా పార్టీల్లో భావన ఉండకూడదన్నారు. ఒకవేళ.. అంతకు మించి ఎదగాలనుకుంటే సొంత పార్టీలోనే ఎదురుదెబ్బలు ఖాయమని తేల్చారు.

సిద్దరామయ్య తీరుతోనే కాంగ్రెస్ పార్టీ పతనమైందని.. స్పీకర్ గా వ్యవహరిస్తున్న రమేశ్ కుమార్ ను పార్టీ కార్యక్రమాల్లో పక్కన కూర్చోబెట్టుకున్న వైనం సరికాదన్నారు. సిద్ధరామయ్య లాంటి వారికి అధికార హోదా తాత్కాలికమని.. అదే శాశ్వితమని భావిస్తే ఎదురుదెబ్బలు తప్పవన్నారు. సిద్ధరామయ్య లాంటి వారికి కాంగ్రెస్ లో ఉన్నంతవరకే మనుగడ అన్నారు. సిద్ధరామయ్య పార్టీలో ఉంటే కాంగ్రెస్ కు మనుగడ ఉండదన్న ఆయన..ఆ విషయాన్ని పార్టీ ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.


Tags:    

Similar News