ఈఎస్ ఐ స్కామ్లో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టా ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆస్తి ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు ఆంధ్రాలో కూడా భారీగానే ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. అమరావతితో పాటూ తిరుపతిలో కుటంబ సభ్యుల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.100కోట్లు ఆస్తులు గుర్తించగా.. ఈ ఆస్తుల చిట్టా ఇంకా పెరిగిపోతోంది.
తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రం విడిపోయిన తరువాత అమరావతిలో పెట్టుబడులుగా తన పిల్లల పేరిట 9 ప్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే అల్లుడి పేరు మీద తిరుపతిలో 700 గజాల్లో జీ ప్లస్ ఫోర్ అపార్ట్మెంట్ ఉన్నట్లు తేల్చారు. రావిరాల హౌసింగ్ బోర్డులో ఒక ఇంటికి రూ.25 లక్షలు అడ్వాన్స్ చెల్లించినట్లు గుర్తించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు గత సెప్టెంబరులో కేసు నమోదు చేసిన ఏసీబీ.. దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తితోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న 19 మంది ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తున్న ఆస్తులతో దేవికారాణికి సంబంధించిన ఆస్తులను ఇప్పటి వరకు లెక్కించలేదు. ఇప్పటికే రెండుమార్లు సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. తాజాగా మూడోసారి సోదాలు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే , ఏపీలో కూడా ఆస్తులు బయటపడటం ఆసక్తికరంగా మారింది. ఏసీబీ తనిఖీల్లో కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు, బ్యాంకులు, బీమా సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను గుర్తించారు. అలాగే ఆమె ఇన్స్యూరెన్స్ సంస్థల్లోనూ ఎఫ్ డీ చేసినట్లు గుర్తించారు. ఏసీబీ అధికారులు ఆ లెక్కల్ని కూడా బయటకు తీసే పనిలో ఉన్నారు.