ఈఎస్‌ఐ కుంభకోణానికి సూత్రధారి ఈయనే ..ఎవరంటే ?

Update: 2020-06-13 14:00 GMT
ఏపీలో ఎప్పుడు ఈఎస్ ‌ఐ కుంభకోణం హాట్ టాపిక్ గా మారింది. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి , టీడీపీ ఎమ్మెల్యే అచ్చన్నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో పాత్ర ఉందంటూ ఈఎస్‌ ఐ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ గాడి విజయకుమార్ ‌ను ఏసీబీ అధికారులుపై అరెస్ట్‌ చేశారు. విజయవాడకు చెందిన ఏసీబీ సెంట్రల్‌ ఇన్విస్టిగేషన్‌ యూనిట్‌ శుక్రవారం రాజమహేంద్రవరం చేరుకొని విజయకుమార్‌ ను ఆయన స్వగృహంలో అరెస్ట్‌ చేసి, విజయవాడ తరలించారు.

ఈఎస్‌ ఐ ఆసుపత్రులకు సరఫరా చేసే మందులు, పరికరాల భారీ కుంభకోణం ఈయన డైరెక్టర్‌ గా ఉన్నప్పుడే జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తగా.. ఏసీబీ అధికారుల దర్యాప్తులో నిర్ధారణ కావడంతో విజయకుమార్‌ ను అరెస్ట్‌ చేశారు. కాకినాడకు చెందిన విజయకుమార్‌ రాజమహేంద్రవరం ఈఎస్ ‌ఐ హాస్పిటల్‌ లో రేడియాలజిస్ట్‌గా విధులలో చేరి, ఇక్కడే ఎక్కువ కాలం విధులు నిర్వహించి ఈఎస్ ‌ఐ హాస్పిటల్‌ సూపరింటెండెంట్ ‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత విజయవాడ ఈఎస్ ‌ఐ హాస్పిటల్స్‌ ఇన్ ‌చార్జ్‌ డైరెక్టర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మందులు, పరికరాల కొనుగోళ్లలో కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ తరుణంలోనే విచారణలో పలు విషయాలు వెలుగు చూడడంతో విజయకుమార్‌ ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. విజయకుమార్‌ రాజమహేంద్రవరం ఈఎస్‌ ఐ ఆసుపత్రిలో వివిధ హోదాలలో పని చేసే సమయంలో కంబాలచెరువు వద్ద అపోలో స్కానింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తూ ఈఎస్ ‌ఐ ఆసుపత్రికి వచ్చే రోగులను తన స్వంత స్కానింగ్‌ సెంటర్‌ కు తరలించి లబ్ధి పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. అలాగే,ఎక్కువ సమయం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఉండకుండా స్కానింగ్‌ సెంటర్‌ లో ఉండడంతో అప్పట్లో సహోద్యోగులతో విభేదాలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఒక ఈఎస్‌ఐ ఆసుపత్రి, ఎనిమిది ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ఉండగా, చికిత్స కోసం వచ్చే రోగులను 14 ప్రైవేటు క్లీనిక్‌లకు, 11 ప్రైవేటు ప్యానల్‌ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
Tags:    

Similar News