కేసీఆర్‌ను వ‌ద‌ల‌ని ఈట‌ల !!

Update: 2022-07-26 07:45 GMT
కేసీఆర్‌పై పీక‌ల వ‌ర‌కు కోపం.. బీజేపీలో ఎవ‌రూ ఊహించ‌నంత ఎత్తు వ‌ర‌కు ఎద‌గాల‌నే క‌సి! వెర‌సి.. మాజీ మంత్రి, బీజేపీ నాయ‌కుడు.. ఈట‌ల రాజేంద‌ర్‌.. ఇప్పుడు అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు `వ‌ద‌ల బొమ్మాళీ` టైపులో మారిపోయార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేర‌కు.. ఈట‌ల దూసుకుపోతున్నార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. టీఆర్ ఎస్‌కు నాయ‌కుల‌ను దూరం చేసి.. బీజేపీని బ‌లో పేతం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు.

ఇటీవ‌ల కేంద్ర మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు అమిత్ షాను క‌లిసిన ఈట‌ల‌.. ఆయ‌న‌ ఆదేశాల మేరకు టీఆర్ ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు టార్గెట్ గా ఈటల రాజేందర్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని ఈటల రాజేందర్ చెబుతూ కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్నారు. కేసీఆర్ మైండ్ గేమ్ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఈటల రాజేందర్ కూడా తనదైన శైలిలో మైండ్ గేమ్ మొదలుపెట్టారని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

తనతో ప్రస్తుతం టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, వారు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని తాజాగా ఈటల రాజేందర్ పేల్చిన బాంబు టిఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. ఈటల టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌ నిర్ణయాలను వ్యతిరేకించే వర్గంతో భేటీ అవుతున్నారని సమాచారం.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి లో ఉద్యమకాలంలో తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకులకు, ఆ తర్వాత బంగారు తెలంగాణ కోసం పార్టీ మారామని చెప్పిన నాయకులకు మధ్య పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది.

ఈ పరిణామాలు బాగా తెలిసిన వ్యక్తి ఈటల రాజేందర్ కావడంతో పార్టీపై తీవ్ర అసంతృప్తితో, కేసీఆర్ నాయకత్వం పై తీవ్ర అసహనంతో ఉన్న నాయకులను గుర్తించి వారిని బీజేపీ బాట పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేస‌మ‌యంలో మరోపక్క కేసీఆర్‌ ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ నిర్వహిస్తున్న సర్వేల ఆధారంగా, వస్తున్న నివేదికలను బట్టి ఈసారి టికెట్ ఇవ్వడం కష్టమని భావించే సిట్టింగ్ లు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది.

అధికార పార్టీలోని సహచరులతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని ప్రతి ఒక్కరు టచ్‌లో ఉన్నారని ఈటల రాజేందర్ చెప్పడం కేసీఆర్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చే ఎన్నికలకు పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఇక వారందరిని బీజేపీలో చేర్పించడానికి ఈటల రాజేందర్  వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. దీనికి గాను త్వ‌ర‌లోనే విందు పార్టీలునిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని..బీజేపీలో డిస్క‌ష‌న్స్ పెరుగుతున్నాయి. మ‌రి దీనిని కేసీఆర్ ఎలా అడ్డుకుంటారో చూడాలి.
Tags:    

Similar News