నలుగురిని ఆరోగ్యంగా ఉంచండి ..వారితో మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి అని సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖని అప్పగిస్తే ..అదే శాఖ ఇప్పుడు వారి రాజకీయ జీవితానికి అనారోగ్యంగా మారింది. అందుకే ప్రస్తుతం ఆరోగ్య శాఖ అంటేనే తెలంగాణ లీడర్లు ఆమడదూరంలో నిల్చుంటున్నారు. సాధారణంగా మంత్రిత్వశాఖలో ఆరోగ్య శాఖ కి పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉండటం తో చాలామంది ఈ శాఖ కోసం పోటీపడేవారు - కానీ ప్రస్తుతం పిలిచి ఇస్తామన్నా కూడా తీసుకోవడానికి కొందరు నేతలు వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకంటే..గత మూడు ధపాలుగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రులుగా చేసిన వారి గురించి పూర్తిగా తెలుసుకుంటే ఇది నిజమే అని అనిపించకమానదు.
టీఆర్ ఎస్ మొదటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాతో రాజయ్యకు వైద్య ఆరోగ్యశాఖని కేటాయించారు. అయితే ఆయనతో వచ్చిన సమస్య ఏమిటో చెప్పలేదు కానీ, ఏకంగా క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. తర్వాత ఆ శాఖను లక్ష్మారెడ్డికి అప్పగించారు. ఆయనతో సీఎం కు ఎలాంటి విభేదాలూ రాలేదు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక లక్ష్మారెడ్డికి మంత్రివర్గంలో కనీసం చోటు కూడా దక్కలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్య శాఖను ఈటెల రాజేందర్ కు అప్పగించారు. ఈయనకి కూడా దాదాపు ఇదే పరిస్థితి. అసలు ఆయనను మంత్రివర్గంలో తీసుకుంటారా లేదా అన్న సస్పెన్స్ నడిచింది.
కానీ, అనేక నాటకీయపరిణామాల మధ్య ఆయనకు మంత్రి పదవి దక్కింది. తనను తొలుత పక్కనపెట్టి - తప్పనిసరి పరిస్థితుల్లోనే శాఖ కట్టబెట్టారని ఫీలయిన ఈటెల - ఒకానొక తీవ్ర మనస్తాపానికి లోనయ్యారట. తర్వాత ఆయన మంత్రి పదవి ఎప్పుడు పోతుందో తెలియదు అన్న ప్రచారం జరిగింది. తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారని ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. తామే గులాబీ పార్టీలకు ఓనర్లమంటూ ఏకంగా బహిరంగ వ్యాఖ్యలు చేసి సంచలనమయ్యారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈటెల మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం ఆ మధ్య జోరుగా సాగింది. ఇలా మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ టిఆర్ ఎస్ నేతలకి ఆరోగ్య శాఖ కలిసిరావడం లేదని ప్రచారం జరుగుతోంది.