మాటల మధ్యలో మన నేతలు చెప్పే ముచ్చట్లు వింటే ఒక్కోసారి మతి పోతుంది. వారు ఏ ఉద్దేశంతో విషయాల్ని చెబుతున్నా.. వారు చెప్పే మాటల్ని అండర్ లైన్ చేసుకొని చూసినప్పుడు ఔరా అని అనిపించాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పిన మాటల్నే చూద్దాం. ఆయన మీడియామిత్రులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురించి.. పెద్ద నోట్ల రద్దు అనంతరం తనకు ఫోన్ చేసి ఇచ్చిన ఆఫర్ గురించి ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చారు.
పెద్ద నోట్ల రద్దు అనంతరం.. తమ పార్టీకే చెందిన కొందరు తనకు ఫోన్లు చేసి పాత నోట్లు ఉంటే.. మార్చి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అలా తనకు ఆఫర్ ఇచ్చిన వారితో తాను.. మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి.. అప్పులు తీర్చుకుంటానని తాను చెప్పినట్లుగా నవ్వుతూ చెప్పారు. సరదాగా చెప్పేసినట్లు కనిపించినప్పటికీ.. ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రికి.. అధికారపార్టీకి చెందిన నేతలు ఫోన్ చేసి మరీ పాత నోట్లను మార్చి ఇస్తామని ఆఫర్ ఇవ్వటాన్ని ఏమనాలి?
మనసులో పెట్టుకోకుండా జరిగిన విషయాన్ని చెప్పినందుకు ఈటెలను అభినందించాలి. అదే సమయంలో.. ఈటెలకు అలాంటి ఆఫర్ ను ఇచ్చే ధైర్యం చేయటంపై ఆయన కాస్త ఆలోచించుకోవటం మంచిది. ఇక.. జయలలిత మరణం గురించి మాట్లాడిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈటెల. బతికి ఉన్నప్పుడు ఎంత సంపాదించినా.. చనిపోయిన తర్వాత వెంట తీసుకెళ్లేది ఏమీ లేదన్న విషయాన్ని ఆయన తనదైన శైలిలో చెబుతూ.. ‘‘పోయేటప్పుడు వెంట ఏమీ తీసుకెళ్లలేం. జయలలిత మాత్రం తన వెంట ఏం తీసుకెళ్లారు? ఆమె పదివేల చీరలు ఏమైపోయాయి?’’ అంటూ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఈటెల మాటల మీద రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చ సాగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/