తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ సీఎం కుమారుడు.. కమ్ ఏపీ మంత్రి లోకేశ్ విమర్శలు చేయటం తెలిసిందే. దీనిపై అప్పుడే రియాక్షన్ వచ్చేసింది. లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్ పైనా.. టీఆర్ ఎస్ సర్కారు మీదా లోకేశ్ చేసిన వ్యాఖ్యల్లో పరిజ్ఞానం లేదన్నారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా.. హుందాగా మాట్లాడాలన్న ఈటెల.. హుస్నాబాద్ లో తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారితే రజాకార్ల రాజ్యం అవుతుందని.. నక్సలైట్లు రాజ్యం అవుతుందని..కుక్కలుచింపిన విస్తరిలా మారుతుందన్న ఆంధ్రా నాయకులు ఏమయ్యారో ప్రజలకు తెలుసన్నారు. ప్రశాంతమైన అభివృద్ధి ప్రాంతంగా తెలంగాణ మారుతుందన్నారు. అన్ని వర్గాల మెప్పు పొందిన కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా కొట్టిపారేశారు.
లోకేశ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా కొట్టిపారేసిన ఈటెల.. కాంగ్రెస్ పైనా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ను ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదంటూ తీవ్ర వ్యాఖ్య చేశారు.
ఎన్నికల మేనిఫెస్టో అన్నది కాంగ్రెస్ కు చిత్తుకాగితం లాంటిదన్న ఆయన..తెలంగాణలో అతి తక్కువకాలంలో ఎక్కువ సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసినట్లు చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ ఈటెల.. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదన్న తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బాగోవేమో ఈటెల సార్? తొందరపడి మాట్లాడే ఇలాంటి మాటల్లో అహంభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని మర్చిపోవద్దు .