రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో జరిగే రెండు ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావటం తెలిసిందే. ఏపీలో బద్వేల్.. తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది.
అయితే.. అందరి చూపులు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మీదనే. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి.. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఈటల రాజేందర్ పై కత్తి కట్టిన కేసీఆర్ కారణంగా ఆయన తన మంత్రి పదవికి తర్వాత ఎమ్మెల్యే పదవికి..పార్టీకి గుడ్ బై చెప్పేసి పార్టీ మారిపోయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్ అలుపు ఎరుగని రీతిలో ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. తనపై సంధిస్తున్న విమర్శనాస్త్రాల్ని తిప్పి కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారం గ్రామంతోపాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా తనకు తన భార్య చెప్పిన మాటల్ని ఆయన పదే పదే గుర్తు చేసుకున్నారు. ఆస్తులన్ని అమ్ము.. కానీ కేసీఆర్ తో కొట్లాట మాత్రం ఆపొద్దని చెప్పారన్నారు. తాను గెలిస్తే తెలంగాణ ముఖ చిత్రం మారుతుందన్న ఆయన.. ప్రసగతి భవన్.. ఫామ్ హౌస్ మొత్తం ఖాళీ అవుతుందని.. కేసీఆర్ రోడ్డు మీదకు వస్తారన్నారు. ఇదంతా చూస్తే.. తన గెలుపు కోసం తానెంత పట్టుదలతో ఉన్న విషయాన్ని ఈటల చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.