జాతీయ ఛానళ్లలో ‘ఈ టీవీ’ మీద చర్చ

Update: 2015-11-08 05:32 GMT
తెలుగువారికి సుపరిచితమైన ఈటీవీ ఛానల్.. జాతీయ స్థాయిలో కూడా ప్రముఖమైనదే. పలు భారతీయ భాషల్లో ఈటీవీ ఛానళ్లు ఉన్నాయి. ముఖ్యమైన సందర్భాల్లో ఈటీవీ నుంచి వచ్చే వార్తలకు విశ్వసనీయత ఎక్కువ. యాజమాన్యాలు ఎవరి చేతుల్లో ఉన్నా.. ఈటీవీ బ్రాండ్ కు ఉన్న ఇమేజ్ ను మాత్రం వారెవరూ దెబ్బ తీయకుండా కంటిన్యూ చేయటం విశేషమే. ఎన్నికల ఫలితాలు.. ప్రకృతివైపరీత్యాల సందర్భంగా ఈటీవీ నుంచి వచ్చే వార్తల్ని ప్రజలు విపరీతంగా నమ్మటం.. వాటినే ప్రాతిపదికగా తీసుకోవటం మామూలే.

జనాల విషయం సంగతి పక్కన పెడితే.. బీహార్ ఎన్నికల సందర్భంగా పలు జాతీయ (ఇంగ్లీష్) ఛానళ్లు ఏర్పాటు చేసిన చర్చల సందర్భంగా వివిధ పార్టీల నేతలు ఈటీవీ ప్రస్తావన తీసుకురావటం.. వారిచ్చే ఎన్నికల ఫలితాల్ని తాము నమ్ముతామని.. తమకు విశ్వాసం ఉందని చెప్పటం విశేషం. తెలుగువారిగా గర్వించదగిన అంశం. తెలుగువారి యాజమాన్యంలో ఉండి ఈమధ్య మార్పులు చోటు చేసుకున్నప్పటికీ.. వివిధ భాషలకు చెందిన ఈటీవీ ఛానళ్ల ప్రధాన డెస్క్ లు హైదరాబాద్ లోనే ఉన్నాయి.

ఉత్తరాదికి చెందిన రాజకీయ పరిణామాలు..హైదరాబాద్ లో ఉన్న డెస్క్ ద్వారా ప్రపంచ ప్రజలకు వార్తలు అందించే ఈటీవీకి ఉన్న ఇమేజ్ ఎలాంటిదన్న విషయం ఇతర ఛానళ్ల చర్చల్లో బయటకు రావటం కాస్తంత విశేషంగా చెప్పాలి. తాము ఈటీవీలో వచ్చే ఫలితాల్ని నమ్ముతామని పలువురు నేతలు వేరే ఛానళ్లలో నిర్వహించిన చర్చల్లో చెప్పటం అరుదైన అంశంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News