ఆ దేశాలు ఆరిపోతే.. మ‌న‌కే లాభ‌మా?

Update: 2015-07-01 12:38 GMT
ప్ర‌పంచం ఒక కుగ్రామంగా మారిపోయిన నేప‌థ్యంలో ఎక్క‌డ‌.. ఏం జ‌రిగినా దాని ప్ర‌భావం అన్నీ దేశాల మీద ప‌డ‌టం మామూలే. అప్పుడెప్పుడో గల్ఫ్ వార్ జ‌రిగితే.. స‌దూరన ఉన్న భార‌త్ వ‌ణికిపోయిన ప‌రిస్థితి. పెట్రోల్ ధ‌ర‌లు అమాంతం పెరిగి.. అంద‌రూ కిందామీదా ప‌డిపోయారు.

మ‌రి.. తాజాగా అప్పుల పాలైన గ్రీస్ కార‌ణంగా మ‌న మార్కెట్ డౌన్ కావ‌టం..కాస్తంత కోలుకోవ‌టం తెలిసిందే. తాజాగా రుణాల ఊబిలో గ్రీస్ తో పాటు.. ప్యూర్టోరికో.. స్పెయిన్‌.. పోర్చుగ‌ల్ లాంటి దేశాలు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోవ‌టం ఖాయ‌మ‌న్న వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రి.. యూరోపియ‌న్ యూనియ‌న్‌లోని దేశాలు ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి కుప్ప‌కూలిపోతే.. మ‌న దేశం ప‌రిస్థితి ఏంటి? ఎలాంటి ఉత్సాతం ఎదుర‌వుతుంద‌న్నది ఇప్పుడో భ‌యంగా మారింది.
ఏం జ‌రుగుతుంద‌న్న‌ది త‌ర్వాత‌.. ఇప్పుటికిప్పుడు అయితే మాత్రం.. ఆయా దేశాల మీద దెబ్బ ప‌డ‌టం ద్వారా భార‌త్‌కు లాభ‌మే అని చెబుతున్నారు. వేరే దేశాలు కుప్ప‌కూలిపోతుంటే.. భార‌త్‌కు ఏ ర‌కంగా లాభం అన్న ప్ర‌శ్న‌కు నిపుణులు చెబుతున్న స‌మాధానం చూస్తే.. అభివృద్ధి దేశాలు రుణ‌భారంతో కుంగిపోతున్న నేప‌థ్యంలో.. క్రూడ్ ఆయిల్ వినియోగం త‌గ్గిపోతుంద‌ని.. ఈ కార‌ణంగా ఆయా దేశాల వినియోగం త‌క్కువ కావ‌టంతో.. ధ‌ర‌ల మీద ప్ర‌భావం ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు త‌గ్గ‌గా.. తాజాగా గ్రీస్ ప‌రిణామంతో పెట్రోల్ ధ‌ర మ‌రింత త‌గ్గింది. ఆగ‌స్టులో డెలివ‌రీ చేసే క్రూడ్ ఆయిల్ ధ‌ర బ్యారెల్ ఒక్కింటికి..58.79డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. బ్రెంట్ ఆయిల్ ధ‌ర కూడా ప‌త‌నం అయ్యింది. గ్రీస్ బాట‌న మరిన్ని దేశాలు ప‌డితే మాత్రం.. ముడి చ‌మురు ధ‌ర మీద తీవ్ర‌ప్ర‌భావం చూపుతుంద‌ని చెబుతున్నారు.అదే స‌మ‌యంలో బంగారం ధ‌ర పెరిగే వీలుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ముడి చ‌మురు ధ‌ర త‌గ్గితే.. భార‌త్ మీద మ‌రింత భారం త‌గ్గ‌టంతో పాటు.. పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు మ‌రింత చౌక అయ్యే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News