రష్యాకు పెద్ద షాకిచ్చిన ఈయూ దేశాలు

Update: 2022-06-01 06:30 GMT
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు యురోపియన్ దేశాలు పెద్ద షాకిచ్చాయి. రష్యా నుండి ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న చమురు, సహజవాయువును కనీసం ఆరు నెలల పాటు  నిలిపేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించాయి. దీనివల్ల రష్యాపై వెంటనే విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిలిచిపోతాయి. దాంతో ఇతర దేశాల నుంచి రష్యా కొనుగోలు చేస్తున్న ఆయుధాలకు పెట్టుబడులు పెడుతున్నది. ఇలాగే దేశం లోపల ఆర్థిక సమస్యలు రాకుండా నెట్టుకొస్తున్నది.

ఈ రెండింటిని గమనించిన యూరోపియన్ దేశాలకు అవసరమైన చమురులో 25 శాతం, సహజవాయువులో 40 శాతం రష్యా నుండే కొనుగోలు చేస్తున్నాయి. ఒకవైపు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న యురోపియన్ యూనియన్ దేశాలు మరోవైపు రష్యాకు నిధుల కొరత రాకుండా పరోక్షంగా సహకరిస్తున్నాయనే చర్చ పెరిగిపోతోంది. రష్యా నుండి చమురు, సహజవాయువును కొనుగులో చేయటం ద్వారా పరోక్షంగా నిధుల ఇబ్బందులు రాకుండా ఆదుకుంటున్నాయని ఈయూ దేశాలపై ఒత్తిడి పెరిగిపోతోంది.

తమపై వస్తున్న ఆరోపణలను, ఒత్తిడిని ఈయూ దేశాలు తాజాగా సమీక్షించాయి. ఈయూ తీసుకున్న తాజా నిర్ణయంతో సహజవాయువు సరఫరా కాకుండా పోలండ్, జర్మనీ ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈయూ దేశాల తాజా నిర్ణయం రష్యాపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలున్నట్లు అర్ధమవుతోంది.

ఎందుకంటే గతంలో ఇవే దేశాలు రష్యాపై ఎన్ని ఆంక్షలను విదించినా ఎలాంటి ప్రభావం కనబడలేదు. అందుకనే రష్యాపై ఆర్ధిక ఆంక్షలు విధించాలని డిసైడ్ అయ్యాయి. రష్యాపై అన్నీవిధాల ఒత్తిడి తీసుకురావటంలో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్లు హంగేరి ప్రకటించింది.

దాదాపు మూడునెలల క్రితం మొదలైన యుద్ధం కారణంగా ఉక్రెయిన్-రష్యా రెండూ నష్టపోయాయి. ఉక్రెయిన్లోని కీలకమైన చాలా నగరాలు, పోర్టు నగరాలు దాదాపు నేలమట్టమైపోయాయి.

ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని నిలిపేసినా ఉక్రెయిన్ పునరుజ్జీవనం జరగాలన్నా కనీసం పదేళ్ళు పడుతుందని నిపుణులు అంచనా వేశారు. తాజాగా విధించిన చమరు, సహజవాయువుల కొనుగోలు నిషేధాన్ని ఆరుమాసాల తర్వాత సమీక్షించాలని కూడా ఈయూ దేశాల సమాఖ్య డిసైడ్ చేసింది.
Tags:    

Similar News