టాలీవుడ్ చరిత్రలోనే గొప్ప హాస్యనటుడిగా పేరుపొందిన బాబు మోహన్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరం అయిపోయారు. ఇప్పటికీ ఆయన చేద్దామన్నా సినిమా చాన్సులు లేవు. పోయినసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గా గెలిచి 2018లో టికెట్ దక్కకపోవడంతో బీజేపీలోచేరారు. ఈ క్రమంలోనే తనకు కేసీఆర్ వద్ద జరిగిన అవమానం గురించి ఆయన తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
2018 ఎన్నికల సమయంలో ఎందుకో తనను పక్కన పెట్టినట్లు అనిపించిందని.. అందుకే కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ఎన్నోసార్లు ప్రయత్నించినా దొరకలేదని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.దాదాపు కేసీఆర్ కు 50 సార్లు ఫోన్ చేసినా ఆయన పట్టించుకోలేదని.. సుమారు 40 ఏళ్ల స్నేహాన్ని కూడా పక్కనపెట్టేశారని కేసీఆర్ తీరుపై ఆవేదన చెందారు బాబు మోహన్.
వారం రోజుల పాటు తాను అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూశానని.. ప్రతిరోజు ఫోన్ చేసి ఎత్తకపోతే ఆ పరాభవాన్ని తట్టుకోలేక ఇక పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరానని తాజా ఇంటర్వ్యూలో బాబు మోహన్ వాపోయారు.ఒక రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తికి ఎన్నో లెక్కలు ఉండి ఉండవచ్చు కానీ.. తమ స్నేహాన్ని గుర్తు పెట్టుకొని ఒక్కసారైనా తనకు మాట్లాడి అసలు విషయం చెప్పి ఉంటే బాగుండేదని కేసీఆర్ తీరుపై బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.