షర్మిల పార్టీలో అంతా స్క్రాప్: ఇందిరా శోభన్ ఘాటు వ్యాఖ్యలు

Update: 2021-08-20 11:31 GMT
వైఎస్ఆర్ టీపీకి ఇటీవలే రాజీనామా చేసి వైదొలిగిన ముఖ్య నాయకురాలు ఇందిరా శోభన్ తాజాగా వైఎస్ షర్మిల పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందిరా శోభన్ పార్టీకి రాజీనామా చేయడంతో వైఎస్ షర్మిలకు గట్టి షాక్ తగిలింది. ఇందిర తన రాజీనామా లేఖను షర్మిలకు పంపారు. సాధారణ పద్ధతిలో ఆమె పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారు. కానీ తాజాగా ఆమె వ్యాఖ్యలు కలకలం రేపాయి. వైఎస్ఆర్ టీపీలో స్క్రాప్ ఉందని ఇందిరా బయటకు వచ్చాక చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

"మన భారత రాజకీయాలలో అరుదైన మహిళా నాయకత్వానికి నేను మద్దతు ఇవ్వాలనుకున్నాను. అందుకే నేను వైఎస్ఆర్ టీపీలో చేరాను, ఇంకా తెలంగాణ ప్రజలు ఇప్పటికీ వైఎస్ఆర్ ని ఆరాధిస్తారు.ఎందుకంటే ఆయన పేద.. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. కొత్త రాజకీయ పార్టీ రాత్రికి రాత్రే అధికారంలోకి రాదని నాకు తెలుసు, కానీ నేను తాజాగా పనులు ప్రారంభించాలనుకుంటున్నాను. నేను షర్మిలను విశ్వసించాను కానీ రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ఆమెతో పాటు చేరిన వ్యక్తులు నిజమైన డీల్ మేకర్స్. వారు ఖచ్చితంగా షర్మిలకు ద్రోహం చేస్తారు, "అని ఇందిరా శోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ఆర్ టీపీ కేడర్ స్క్రాప్‌ ఇందిర విమర్శించారు. "పక్క గ్రామానికి వెళితే పరిచయం లేని వ్యక్తులు వైఎస్ఆర్ టీపీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాంటి వ్యక్తులతో, ఇది పార్టీకి భారీ నష్టం.. ఇలా ఏ పార్టీ ఏ ఎన్నికల్లోనూ గెలవదు. వైఎస్ఆర్ టీపీ క్యాడర్ స్క్రాప్. అలాంటి తెలివితక్కువ వ్యక్తులతో పనిచేయడం నాకు అసౌకర్యంగా ఉంది. నేను బయటకు వచ్చాను. ముందుగా ఈ స్క్రాప్ పార్టీ నుంచి తొలగించబడాలి, లేకుంటే ఆ పార్టీ భవిష్యత్తు లేదు" అని ఇందిరా సంచలన వ్యాఖ్యలు చేశారు.

షర్మిలకు ఈ విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నించారా అని ఇందిరను విలేకరులు ప్రశ్నించారు. తాను ప్రయత్నించానని.. కానీ అది షర్మిలకు సంబంధించినదని.. ఆమె ఏమి చేస్తుందో చూడాలని అన్నారు. షర్మిల తప్ప, కింది స్థాయి నాయకులు.. క్యాడర్‌కి ఏ విషయంలోనూ తీవ్రత లేదన్నారు. ఈ విషయాలు షర్మిలను కచ్చితంగా కలవరపెడతాయి ఇబ్బంది పెడతాయి "అని ఇందిర అన్నారు.

రాజగోపాల్ అనే ఒక నాయకుడిపై కూడా ఇందిర విమర్శలు గుప్పించింది. "పార్టీ హోదాకు ఆయనే బాధ్యుడు. అతను వైఎస్ఆర్ టీపీలో ఉన్నంత కాలం, పార్టీ ఎదగదు. షర్మిల ఒంటరిగా వైఎస్ఆర్‌టిపిని నిర్వహించలేరు.. ఒక రాజకీయ పార్టీకి టీం ముఖ్యం. ఆ టీంతో కృషి చేస్తేనే గెలుస్తాం 'అని ఇందిరా శోభన్ తీవ్రంగా దుయ్యబట్టారు.

తన భవిష్యత్తు రాజకీయ గమనంపై కూడా ఇందిర స్పందించారు. తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ తనను సంప్రదించాయని, అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇందిర పేర్కొన్నారు.
Tags:    

Similar News