త్వరలో జరగనున్న వరంగల్ ఉప ఎన్నికలో ఒక విశేషం చోటు చేసుకోనుంది. ఇప్పటివరకూ ఓటేసే సమయంలో పార్టీ గుర్తు.. అభ్యర్థి పేరు మత్రమే చూసే వీలుంది. అయితే.. త్వరలో వరంగల్ లోక్ సభా స్థానానికి నిర్వహించనున్న ఉప ఎన్నికలో అభ్యర్థుల ఫోటోల్ని కూడా చూసి ఓటేసే వెసులుబాటు ఉంది.
ఈ సరికొత్త విధానాన్ని తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి అమలు చేయనున్నారు. తాజా విధానంతో కాస్త దగ్గరగా పేర్లు ఉండేవారు.. కాస్త దగ్గరైన పార్టీ గుర్తులతో బోల్తా కొట్టించే వారికి తాజా విధానం షాక్ ఇవ్వటం ఖాయం. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. రాబోయే రోజుల్లో అభ్యర్థుల ఫోటోల్ని చూసి ఓటేసే వీలుంటుంది. దీంతో.. ఓటరు తాము ఎవరికి ఓటు వేయాలని భావిస్తామో వారికే నూటినూరుపాళ్లు ఓటేసే అవకాశం ఈవీఎంలలో ఫోటో విధానం కల్పిస్తుందని చెబుతున్నారు. వరంగల్ లోక్ సభ ఓటర్లు ఈసారి.. అభ్యర్థి పేరు.. పార్టీ గుర్తుతో పాటు.. అభ్యర్థి ఫోటో చూసి మరీ ఓటేయొచ్చన్నమాట.