ఆళ్ళగడ్డలో అఖిలప్రియ విశ్వరూపం... టీడీపీదే బాధ్యత...?

Update: 2022-08-10 00:30 GMT
ఆళ్ళగడ్డ భూమా ఫ్యామిలీ అడ్డా అని గత దశాబ్దాలలో చెప్పుకునేవారు. రాజకీయ కధ కూడా అలాగే సక్సెస్ ఫుల్ గా  సాగింది. అయితే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఎపుడైతే మరణించారో నాటి నుంచి ఆ కుటుంబం పట్టు అక్కడి రాజకీయాల్లో సడలిపోతూ వచ్చింది. భూమా ఫ్యామిలీకి రాయలసీమలో  ఉన్న సానుభూతిని పొలిటికల్ గా బాగ  పొందడానికి చంద్రబాబునాయుడు ఆమెను వైసీపీ నుంచి తెచ్చి మంత్రిని చేశారు. అయితే రాజకీయ అనుభవం తక్కువ కావడంతో అఖిలప్రియ దూకుడు తప్ప తన పలుకుబడిని పెంచుకోలేకపోయారు.

ఫలితంగా 2019 ఎన్నికల్లో గంగుల ఫ్యామిలీ చేతిలో వైసీపీ ద్వారా ఆమె ఓటమిని చవిచూశారు. ఆ మీదట పరిణామాలలో అఖిలప్రియ క్రేజ్ కూడా తగ్గుతోంది. భూమా కుటుంబని కూడా రెండుగా చీలిపోయింది. ఇపుడు భూమా ఫ్యామిలీలోనే ఎన్నో గొడవలు, వివాదాలు. ఆమెకు సోదరుడి వరస అయ్యే భూమా కిషోర్ రెడ్డి అఖిలప్రియతో పడక బీజేపీలో చేరిపోయారు. ఆయన తన రాజకీయ సత్తాను చాటాలని చూస్తున్నారు.

ఇంకో వైపు చూస్తే ఆళ్ళగడ్డలో, అక్కడి రాజకీయాలలో అఖిల ప్రియ భర్త భారగ్ వాం పెత్తనం కూడా బాగా పెరిగిపోయిందని గతంలోనే ఫియ్రాదులు వచ్చాయి. ఇవన్నీ ఇలా ఉంటే లేటెస్ట్ గా మరో వివాదంలో భూమా అఖిలప్రియ పేరు వినిపిస్తోంది. అఖిల ప్రియతో పాటు,  ఆమెకు సంబంధించిన  వ్యక్తులు రుద్రవరం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రెహమాన్‌ను సెటిల్‌మెంట్ కోసం పిలిపించి, అతని నుంచి రూ.1.35 కోట్లు దోచుకునేలా కొట్టారని ఆరోపించారు.

ఈ విషయంలో టీడీపీ నాయకత్వం ప్రోత్సాహం అండ అఖిలప్రియకు ఉన్నాయా అని కిశోర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ లేకపోతే మాత్రం టీ డీపీ నాయకత్వం అఖిల ప్రియను పైకి లాగి రెహమాన్‌కు డబ్బు తిరిగి ఇచ్చేలా చూడాలని కోరారు. అలాగే రహమాన్  ఆయన ప్రాణాలకు ఏదైనా జరిగితే టీడీపీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది కూడా ఆయన హెచ్చరించారు. మరో వైపు చూస్తే జగన్ సర్కార్ కూడా కాంట్రాక్టర్లకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరడం విశేషం.

తెలుగుదేశం నాయకత్వం అఖిలప్రియను ఇలా అలా వదిలేస్తోందా లేక మాఫియా కార్యకలాపాలకు మద్దతు ఇస్తోందా అన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి చూస్తే ఒకే కుటుంబం ఒకే రక్తం అయినా భూమా ఫ్యామిలీలో గొడవలు ముదిరిపాకన పడుతున్నాయి. అఖిల మీద కిశోర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అయితే సంచలనం అవుతున్నాయి.

ఇంకో వైపు చూస్తే అఖిలప్రియకు కిశోర్ రెడ్డికి కూడా ఒక ఇంటి కాంపౌండ్ గోడ కూల్చివేత వ్యవహారంలో కూడాఆ మధ్యన  నేరుగా గొడవలు జరిగాయి. మొత్తానికి ఆళ్ళగడ్డలో అఖిలప్రియ హవా తగ్గలేదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా కిశోర్ రెడ్డి మాటలను బట్టి అర్ధమవుతోంది. ఏది ఏమైనా కిశోర్ రెడ్డి వర్సెస్ అఖిలప్రియ గా ఆళ్లగడ్డ మరోసారి మండుతోంది.
Tags:    

Similar News