కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి స్వలింగ సంపర్క వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న నిరసన

Update: 2022-03-25 13:30 GMT
భోపాలీలంటే స్వలింగ సంపర్కులంటూ 'ది కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చేసిన కామెంట్లపై దుమారం చెలరేగింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వివేక్ అగ్నిహోత్రి 'నేను భోపాల్ లో పెరిగినా.. అనుబంధం ఉన్నా.. భోపాలీ అని పిలుచుకోవడానికి ఇష్టపడను. ఎందుకంటే ఆ పదానికి ఒక నిర్ధిష్ట అర్థం జనాల మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. భోపాలీలు స్వలింగ సంపర్కులుగా భావించబడుతున్నారని.. అందుకు బోధపాల్ నవాబీ నగరం కావడం.. వాళ్ల కోరికలే కారణం అయి ఉండొచ్చు అని వివేకా్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. 'వివేక్ ఇది నీ వ్యక్తిగత అనుభవం కావచ్చు. అంతేకానీ భోపాల్ ప్రజలది కాదు.. నేను 77 ఏళ్ల నుంచి భోపాల్, ఇక్కడి ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నా.. కానీ నాకు ఏనాడు అలాంటి అనుభవం ఎదురుకాలేదు. ఎక్కడున్నా.. మీ పక్కన ఉండేవాళ్ల దానికి కారణమై ఉంటుందని గుర్తించండి అంటూ ట్వీట్ తో దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కామెంట్లపై మీడియా సైతం వివేక్ ను ఇరుకునపెట్టి విమర్శలు చేసింది. ఇక శుక్రవారం ఉదయం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ అగ్నిహోత్రిని మీడియా ప్రతినిధులు ఈ 'హోమో సెక్సువల్స్' కామెంట్లపై వివరణ అడగగా.. మౌనంగా వెళ్లిపోయారు. ఆయన వెంట ఉన్న బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వరిగ్యాను మీడియా అడ్డుకొని 'నేను ఇండోర్ వాసిని.. అదేదో ఆయన్నే అడగొచ్చుగా' అంటూ తప్పించుకున్నారు.

ఇక కాంగ్రెస్ నేత కేకే మిశ్రా సైతం ఈ వ్యవహారంపై మండిపడ్డారు. అగ్ని హోత్రి వ్యాఖ్యలపై నేనేం మాట్లాడను  బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతల స్వలింగ సంపర్కం వెలుగులోకి వచ్చాకే ఆయన వివేక్ అగ్నిహోత్రి ఇలా స్పందించాడని సెటైర్లు వేశారు

మొత్తంగా కశ్మీర్ ఫైల్స్ విజయం ఊపులో ఉన్న ఆ దర్శకుడు అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News