రంగా హత్యకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి.. ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన వసంత నాగేశ్వరరావు. కృష్ణా జిల్లాలో హత్యలు చేయించేది.. ప్రోత్సహించేది ఎవరన్న విషయం ప్రజలకు తెలుసంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రోజుకో పార్టీ మారుస్తూ.. ఆస్తుల కోసం హత్యలు చేసే హంతకులు డబ్బు సంచులతో వస్తున్నారంటూ తనపైనా.. కృష్ణ ప్రసాద్ పైనా మంత్రి ఉమా ఆరోపణలు చేయటంపై వసంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి దేవినేని ఉమపై తీవ్రంగా రియాక్ట్ అయిన వసంత.. హత్యలు చేసి జైలుకు వెళ్లిన చరిత్ర ఉమా కుటుంబ సభ్యులదేనన్న ఆయన.. దేవినేని ఉమా వదిన ఎలా చనిపోయారో.. ఎవరి హస్తముందో అందరికి తెలుసంటూ కొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. రంగా హత్యలో మాస్టర్ మైండ్ ఎవరిదన్న విషయం అందరికి తెలుసన్న ఆయన.. తన అనుమానపు వేలును దేవినేని ఉమా వైపు చూపించటం గమనార్హం.
దేవినేని ఉమా అంతటి అసమర్థుడ్ని తాను చూడలేదంటూ విరుచుకుపడిన వసంత నాగేశ్వరరావు.. ఉమాకు రాజకీయంగా జన్మను ఇచ్చిన కంచికచర్ల.. వీరులపాడు మండలాలకు సైతం నీరు ఇవ్వలేకపోయారన్నారు. జలవనరుల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నదేవినేని ఉమా కనీసం తన ప్రాంత ప్రజలకు సాగునీటిని కూడా అందించలేకపోవటంపై మండిపడ్డారు.