ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంపై విమర్శలు కంటే నవ్వులు ఎక్కువ పేలుతున్నాయి. చరిత్రలో ఎవరూ చేయని ఆలోచన చంద్రబాబు చేశారు. సీబీఐ రాష్ట్రంలో దర్యాప్తునకు రాకూడదని - రాష్ట్రంలో ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ చేస్తూ ఒక జీవో ఇచ్చారు చంద్రబాబు. బహుశా ఏపీ చరిత్రలోనే ఇది అరుదైన జీవో. చంద్రబాబు ఈ చర్యతో ఏంటీయన ఇలా ప్రవర్తిస్తున్నాడు అని సామాన్యులు కూడా ఆలోచించే పరిస్థితి. సీబీఐ ఒక కేంద్ర సంస్థ దానిని రావొద్దనడం ఏంటి? అంటే తప్పులు చేసిన ప్రభుత్వాలు ఇలా నిషేధిస్తూ పోతే అరాచకాలకు అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి హక్కు రాష్ట్రాలకు రాజ్యాంగం ఇవ్వలేదు. బాబు రాజ్యాంగాన్ని అతిక్రమించారు. దీనిపై మాజీ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.
కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థల్లో జరిగే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలపై నేరుగా సీబీఐ దాడులు చేయవచ్చునని, దానికి ఎవరి అనుమతి అవసరం లేదని ఉండవల్లి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం - తన ఆధీనంలో ఉన్న అంశాలపై విచారణ కావాలంటే కోరవచ్చునని చెప్పారు. అయితే, ఉండవల్లి ఓ రహస్యాన్ని విప్పారిక్కడ. చంద్రబాబు తన 15 ఏళ్ల పాలనలో ఏనాడూ సీబీఐ ఎంక్వైరీ కోరలేదట. దేశంలోని ప్రతి అడగు కోర్టు పరిధిలో ఉంటుంది. కోర్టు ఆదిశిస్తే ఎక్కడయినా సీబీఐ ఎంక్వైరీ చేయవచ్చునని ఉండవల్లి అన్నారు. ప్రభుత్వం సీబీఐని అడ్డుకుంటూ ఇచ్చిన జీవో చెల్లదన్నారు. ఆ జీవో టిష్యూ పేపర్ తో సమానం అని ఉండవల్లి కొట్టిపారేశారు. ఇలాంటివి ఇప్పటికే జరిగాయని ఉత్తర్ ప్రదేశ్ లో కల్యాణ్ సింగ్ సర్కార్ - పప్పూ యాదవ్ కేసుల్లో ఇదే జరిగిందని ఉండవల్లి గుర్తు చేశారు. ఇలాంటి జీవోలు విడుదల చేస్తే చంద్రబాబు సమర్థతపై జనాలకు అనుమానాలు వస్తాయని, అది ఆయన పర్సనల్. కానీ ఏపీ పరువు పోయిందన్నారు. ఐటీ రైడ్లు ఎవరి మీదో జరిగితే తనను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారని ఓ సీఎం చెప్పడం దారుణమని అన్నారు. ఈ జీవో చంద్రబాబు మళ్లీ ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు ఉండవల్లి.
మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని రాష్ట్రంలోకి ప్రవేశించకుండా నిరోధించే అధికారం రాష్ట్రాలకు ఉండదని సుప్రీం కోర్టు న్యాయవాది ఎం.ఎల్ శర్మ చెప్పడం విశేషం. సీబీఐని నియంత్రించే అధికారం రాష్ట్రాలకు ఉండదని అన్నారు. కేసులను బట్టి కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ విధించొచ్చని... మొత్తానికే సీబీఐని నిరోధించడం సాధ్యం కాదని - షెడ్యూల్ 7ఏ ప్రకారం కుదరదన్నారు. ఈ రాజ్యంగ విరుద్ధమైన జీవోను కోర్టు కొట్టేస్తుందని పేర్కొన్నారు.