దేశంలో గుణాత్మకమార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దేశవ్యాప్తంగా వివిధ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పలు టూర్లు వేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ - మాజీ ప్రధాని - JDS నేత దేవెగౌడ - కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి - DMK అధినేత కరుణానిధి - స్టాలిన్ లను కలిశారు. వీరందరూ కేసీఆర్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించారని టీఆర్ ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. అయితే...వీరితో భేటీ అనంతరం ఈ ఫ్రంట్ హడావుడి అలా ఓ పక్కన పడిపోయింది. తాజాగా ఇందులో మరో ముందడుగు పడిందని టీఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి.
కాంగ్రెస్ ఎంపీ సుబ్బిరామిరెడ్డి మనువడి వివాహానికి హాజరయ్యేందుకు శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో జేడీఎస్ చీఫ్ - మాజీ ప్రధాని దేవెగౌడ హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. అలా వచ్చిన జేడీఎస్ అధినేత ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతిభవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ దేవెగౌడకు ఘనస్వాగతం పలికారు. దేవెగౌడను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను కూడా బహూకరించారు. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. కేసీఆర్ తో భేటీ తరువాత మాజీ ప్రధాని నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరారు. ఈ సమావేశంలో మేయర్ రామ్మోహన్ - పలువురు ఎంపీలు - ఎమ్మెల్యేలు పాల్గొన్నారని టీఆర్ ఎస్ వర్గాల మాట.
అయితే టీఆర్ ఎస్ వర్గాలు ప్రచారంలో పెట్టినట్లు ఈ సమావేశంలో ఫెడరల్ ఫ్రంట్ గురించి నిజంగా చర్చించారా అనేది అనేక వర్గాలను సందేహంలో ఉంచుతున్న అంశం. ఒకవేళ ఫ్రంట్ చర్చ నిజంగానే వస్తే...కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసిన దేవెగౌడ అదే పార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు విషయమై ఎలా స్పందించారనేది ఆసక్తికరమైన ప్రశ్న. పైగా ఇటీవలి కాలంలో కేసీఆర్ ఫ్రంట్ చడీచప్పుడు లేని నేపథ్యంలో దేవెగౌడ జాతీయ రాజకీయాల గురించి ఏమని చర్చించారో టీఆర్ఎస్ నాయకులకే తెలియాలి! అంతేకాకుండా కాంగ్రెస్‌తో కలిసి సాగుతున్న నాయకుడిని తన ఫ్రంట్ వైపు కేసీఆర్ ఎలా ఆకర్షించగలిగారు? ఇందుకోసం ఆయన చెప్పిన మాటలు ఏంటి? అనేవి గులాబీ దళపతి స్పందిస్తే తప్ప క్లారిటీ రాని అంశాలు.