కేసీఆర్ కు అదే మాట చెప్పారా మిస్టర్ దువ్వూరి

Update: 2016-11-16 15:04 GMT
ఒకే విషయం మీద దేశం మొత్తం ఎన్ని రోజులు మాట్లాడుకుంటుంది? అసలు మాట్లాడుకునే అవకాశం ఉందా? అంటే ఉందనే చెప్పాలి. ప్రధాని మోడీ తీసుకున్న తాజా నిర్ణయం దేశంలోని కనీసం 120 కోట్ల మంది (మిగిలిన కోట్ల మందిని చిన్నారులుగా వదిలేద్దాం) గడిచిన వారం రోజులుగా అదే పనిగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు పరిస్థితుల్ని చూస్తే.. రానున్న మరో నెల రోజులకు పైనే ఇదే విషయంపై మాట్లాడుకోవటం ఖాయంగా చెప్పొచ్చు. ఇలా.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా.. ఇద్దరు కలిస్తే వారి మొదటి మాటల్లోనే నోట్ల రద్దు మాట వస్తున్న పరిస్థితి.

ఇదిలాఉంటే.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త భిన్నంగా.. మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు అంశంపై నిశితంగా అధ్యయం చేస్తున్నారు. గవర్నర్ నరసింహన్ తో మొదలు.. పలువురు కీలక అధికారులతో పాటు.. ఆర్థికవేత్తలతోనూ మాట్లాడుతున్న ఆయన.. మాజీ ఆర్ బీఐ గవర్నర్లతో సైతం భేటీ కావటం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన సందర్భంగా పెద్ద నోట్ల రద్దుపై ఆయనతో ఏం మాట్లాడారో చెప్పనప్పటికీ.. తాజాగామాత్రం మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దుపై రియాక్ట్ అయ్యారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదన్న ఆయన.. ద్రవోల్బణం తగ్గుదలకు.. పెట్టుబడులకు ఇది సానుకూలాంశంగా చెప్పుకొచ్చారు. తన దృష్టిలో పెద్దనోట్ల రద్దు మంచి నిర్ణయంగా ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్రం నిర్ణయంతో బ్యాంకర్లు ప్రజలను ఆన్ లైన్ వేదికగా లావాదేవీలను జరిపేందుకు ప్రోత్సహించినట్లుగా మారిందని.. నగదుతో కూడి ఆర్థిక వ్యవస్థ నుంచి అతి తక్కువ నగదు వినియోగ వ్యవస్థకు బాటలు పడినట్లైందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నగదు నిర్వహణపై చర్యలు తీసుకోవాలన్న ఆయన.. వ్యవస్థలోకి మళ్లీ నల్లధనం వేళ్లూనుకోకూడని హెచ్చరించారు. ఓపెన్ గా మోడీ నిర్ణయాన్ని ఇంతగా సమర్థించిన ఆయన.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడిన సందర్భంగా ఆయనేం చెప్పారంటారు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News