జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులకు తీపి కబురుగా చెప్పాలి. గడిచిన కొంతకాలంగా కంపెనీ పరిస్థితులతో కిందా మీదా పడుతున్న ఉద్యోగులకు విచిత్రమైన అనుభవం తాజాగా ఎదురవుతోంది. జెట్ ఎయిర్ వేస్ దివాలా ప్రక్రియలో భాగంగా ఆ కంపెనీనీ టేకోవర్ చేయటానికి జలాన్ కల్రాక్ కన్సార్షియం ముందుకు రావటం తెలిసిందే. ఈ సంస్థ.. జెట్ ఎయిర్ వేస్ ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. అయితే.. ఇందుకు కీలక ఎన్నికను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక కంపెనీని టేకోవర్ చేయటానికి ఎన్నిక ఏమిటన్న సందేహం రావొచ్చు.
జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్ అనుమతి లభించిన తర్వాత లోన్ సెటిల్ మెంట్ ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్ వేస్ సిబ్బందిలో కనీసం 95 శాతం ఉద్యోగులు టేకోవర్ కు అనుకూలంగా ఓట్లు వేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే జెట్ ఎయిర్ వేస్ కొనుగోలు చేయటానికి బిడ్ కు క్లియరెన్సు లభిస్తుంది. దీంతో.. ఉద్యోగుల ఓట్లు కీలకమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు అనుకూలంగా ఓట్లు వేసేందుకు జలాన్ కల్రాక్ కన్సార్షియం కొత్త ఆఫర్ ను ప్రకటించింది.
తమ టేకోవర్ డీల్ కు అనుకూలంగా ఓట్లు వేసే ఉద్యోగులు.. కార్మికులకు ఫోన్లు.. ఐప్యాడ్ లు లేదంటే ల్యాప్ టాప్ లు ఇస్తామని చెబుతోంది. ఈ బహుమతులతో పాటు రూ.22,800 చొప్పున నగదును ఇస్తానని చెబుతోంది. అంతేకాదు.. ఒక్కో ఉద్యోగికి ర.11వేల చొప్పున నగదు మొత్తాన్ని చెల్లిస్తానని చెబుతోంది. ఇలా బహుమతులు.. నగదు చెల్లిస్తామన్న మాట ఉద్యోగుల్లో కొత్త చర్చకు తెర తీసింది.
ఇంతకీ ఉద్య్గెగులు ఓట్లు వేయాల్సింది ఎప్పటి నుంచి అంటే.. ఈ నెల ఐదు నుంచి ఆగస్టు నాలుగు వరకు కొనసాగనుంది. 2019 ఏప్రిల్ 17న జెట్ ఎయిర్ వేస్ మూతపడింది. అప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు.. తాజా పరిణామం కొంత ఊపశమనాన్ని కలిగిస్తుందన్న మాట వినిపిస్తుంది. మరి.. ఈ ఆఫర్లకు జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది ఎలా రియాక్టు అవుతారో చూడాలి.