ఎన్నికలు ఏవైనా మిగిలిన వారితో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్లేషణ ఆసక్తికరంగా ఉంటుంది. మిగిలిన రాష్ట్రాలు.. జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఆయన అంచనాలు కాస్త తేడా కొట్టొచ్చేమో కానీ.. తెలంగాణ వరకు మాత్రం ఆయన నోటి నుంచి వచ్చే మాటలే నిజమయ్యే పరిస్థితి. చాలామంది కొట్టిపారేసినా.. కేసీఆర్ సారు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఫలితాల గురించి చెబుతున్నారన్న విమర్శ వినిపించినా..ఫలితాలు మాత్రం దాదాపుగా ఆయన లెక్కలకు దగ్గరగా రావటం చూశాం.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో 16 స్థానాల్లో తమ గెలుపు ఖాయమని ఢంకా బజాయించి మరీ చెప్పారు కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లోనూ 16 స్థానాల్లో తమ విజయం తథ్యమన్న ధీమాను వ్యక్తం చేశారు. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే.. కేసీఆర్ అంచనాలు తప్పన్న విధంగా జాతీయ స్థాయి మీడియా సంస్థల లెక్కలు ఉండటం గమనార్హం.
అత్యధికులు కాంగ్రెస్ కు ఒక్క సీటు ఖాయమని.. అదే విధంగా బీజేపీ కూడా ఒక స్థానంలో గెలుస్తుందన్న మాటను చెప్పటం కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే.. కేసీఆర్ అంచనాల్లో తేడా కొట్టినట్లుగా ఉన్నాయి. మరి.. ఎగ్జిట్ పోల్స్ కరెక్టా? కేసీఆర్ సారు మాట కరెక్టా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం ఈ నెల 23 వరకూ వెయిట్ చేయాల్సిందే.
తెలంగాణ (లోక్‌సభ) మీద వెలువడిన వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ లెక్కలు ఇవే..
సర్వే సంస్థలు తెరాస కాంగ్రెస్ ఎంఐఎం భాజపా
ఆర్జీ ఫ్లాష్ టీం 14-16 0-2 1 0
న్యూస్18 12-14 1-2 1 1-2
ఎన్డీటీవీ 12 2 2 1
ఇండియా టుడే 10-12 1-3 1-3 1
సీ ఓటర్ 14 1 1 1
టైమ్స్ నౌ 13 2 1 1
టుడేస్ చాణక్య 12-16 1-2 1-2 1