మున్సిపల్ పోరుపై మాజీ డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన

Update: 2020-03-13 10:45 GMT
కర్నూలులో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఇన్నాళ్లు టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య హోరాహోరీ పోటీ ఉండగా తాజాగా ఇప్పుడు అంతా వైఎస్సార్సీపీ ఆధిక్యం కనబరుస్తోంది. దీనికితోడు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతుండడంతో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకీ ఘోర పరాభవం తప్పేట్టు లేదు. దీనికి తోడు ఎన్నికలను అవినీతి రహితంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో టీడీపీ నాయకులు గందరగోళంలో పడ్డారు. డబ్బు, మద్యం, కానుకలు పంచితే జైలుకే అని ప్రభుత్వం ప్రకటించడంతో టీడీపీ నాయకులు డీలా పడిపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే మిగతా స్థానాల్లో టీడీపీలోనే ఉన్న నాయకులు మాత్రం పోటీ చేసేందుకు జంకుతున్నారు.

పోటీ చేసి ఎందుకు ఇబ్బందులు తెచ్చి పెట్టుకోవడం.. పోటీ నుంచి వైదొలిగితే ప్రశాంతంగా ఉంటాం కదా అని ఓ అభిప్రాయానికి వచ్చారంట. అందుకే చాలా జిల్లాల్లో స్థానికంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నాయకులు పోటీ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా తమ వర్గాన్ని పోటీలో నిలపడం లేదని ప్రకటించారు. దీంతో కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగిరేసే అవకాశం ఉంది. తాజాగా తన తమ్ముడు కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారని మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి మీడియా ముఖంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా మీడియాతో కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. నా సోదరుడు ప్రభాకర్ పార్టీ మారే విషయం తనతో మాట్లాడ లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలోకి ఆయన వెళ్తే అభ్యంతరం లేదని తెలిపారు. అయితే ప్రస్తుత అధికార పార్టీ తీరుకు నిరసనగా తాము డోన్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. పోటీ నుంచి టీడీపీ వైదొలుగుతుందని స్వయంగా వెల్లడించారు. డోన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో పోటీ చేయకూడదని తమ పార్టీ నిర్ణయించిందని, వాటన్నింటిని ఆర్థిక మంత్రి బుగ్గనకు దానం చేస్తున్నట్లు తెలిపారు.
Tags:    

Similar News