దొంగ అంటే.. ముఖం మీద గాటు పెట్టుకొని, లుంగీ కట్టుకొని, మీసాలు మెలితిప్పి భయంకరంగా ఉంటాడనేది పాతతరం ఊహ. ఇప్పుడంతా స్మార్ట్ యుగం కదా.. సో, దొంగలు కూడా అంతకు మించిన స్మార్ట్ గా తయారయ్యారు. స్మార్ట్ గా పరిచయం పెంచుకొని, ఆ తర్వాత దగ్గరై.. ఆ తర్వాత మరింతగా చేరువై.. స్మూత్ గా మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ కథే ఇది.
హైదరాబాద్ కు చెందిన టీజనేజ్ యువతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఫ్రెండ్స్ తో చాటింగులు.. మీటింగులు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తనకు తెలిసిన ఫ్రెండ్ పేరుతో ఫేస్ బుక్ రిక్వెస్ట్ వచ్చింది. మన ఫ్రెండేగా అని యాక్సెప్ట్ చేసింది. ఇంకేముందీ..? వెంటనే ‘హాయ్’ అని మెసెంజర్ లో చాట్ మొదలైంది. అలా మొదలైన మీటింగు ఎక్కడిదాకా వెళ్లిందంటే.. నగ్న చిత్రాలు పంపించుకునేదాకా వెళ్లింది!
అంతదూరం వెళ్లేదాకా ఏం చేస్తోందీ? వెంటనే కట్ చేయొచ్చు కదా అంటున్నారా? అదే మోసగాళ్ల టాలెంట్. అలా కట్ చేయనీయకుండా.. కంటిన్యూ చేసేట్టు చేయడమే వాళ్ల టాలెంట్. అదికూడా టీనేజ్ పిలగాళ్లు కాబట్టి.. ఇంకా సింపుల్ గా డీల్ చేస్తుంటారు. తనతోపాటు తన చెల్లి డ్రెస్ ఛేంజ్ చేసుకునే ఫొటోలను కూడా పంపించిందా యువతి. అవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత అసలు రూపం చూపించడం మొదలు పెట్టాడా చీటర్.
డబ్బులు ఇస్తావా? ఇంటర్నెట్ లో పెట్టమంటావా? అని వేధించడం స్టార్ట్ చేశాడు. ఈ బాధ తట్టుకోలేక చివరకు ఆత్మహత్యకు సిద్ధపడింది. చేతి మణికట్టు కోసుకొని ఆసుపత్రి పాలైంది. ఇంత దూరం వెళ్లేంత వరకూ గమనించని తల్లిదండ్రులు.. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఆరాతీస్తే.. అసలు విషయం చెప్పింది. పేరెంట్స్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులు రంగంలోకి దిగారు. కేటుగాడ్ని పట్టేసుకున్నారు. ఆరా తీస్తే.. ఇప్పటి వరకూ వాడు ఎంతో మందిని మోసం చేశాడట. అందరినీ ఇదే పద్ధతిలో వేధించాడట. సో.. బీ కేర్ ఫుల్. ఫేస్ బుక్ ప్రొఫైల్ ను చెక్ చేయకుండా.. అందులోని పోస్టులను పరిశీలించకుండా.. తెలిసినవారేనని నిర్ధారించుకోకుండా.. ఫ్రెండ్‌రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయొద్దు. ముఖ్యంగా అమ్మాయిలు అస్సలు చేయొద్దు.