ఫేస్‌ బుక్ నిన్ను నగ్నంగా చూస్తుంది జాగ్రత్త!

Update: 2020-04-21 06:50 GMT
ఫేస్‌ బుక్‌ ను మనం రెగ్యులర్‌ గా వాడకపోయినా.. మన ఫోన్లో ఆ యాప్ ఉంటే చాలు అది నిత్యం మనం ఏం చేస్తున్నామో చూస్తూనే ఉంటంది.. వింటూనే ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే.  కేంబ్రిడ్జి ఎనలిటికా వంటి ఎన్నో ఉదంతాలు ఫేస్‌ బుక్‌ ను ఏమాత్రం నమ్మడానికి వీల్లేని సంస్థగా మార్చేశాయి. అయితే... రెండు నెలల కిందట ఫేస్ బుక్ ఓ ఫీచర్ తీసుకొచ్చింది. ఫేస్ బుక్ యాప్ ఉండి.. దాన్ని మనం వినియోగించని సమయంలోనూ అది మన యాక్టివిటీని ఎలా ట్రాక్ చేస్తుంది.. ఏమేం తెలుసుకుంటుందనేది చెప్పే ఫీచర్ అది. అయితే.. ఫేస్ బుక్ చెప్పేది వేరు చేసేది వేరనేది చాలామంది నుంచి వస్తున్న ఆరోపణ.

ఈ నేపథ్యంలో ట్రాకింగ్ ముప్పు నుంచి బయటపడాలంటే ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారు. ఫేస్‌ బుక్ సెట్టింగ్స్‌ లోకి వెళ్లి ఆఫ్ ఫేస్ బుక్ యాక్టివిటీపై క్లిక్ చేయాలి. అక్కడ ఆఫ్ ఫేస్ బుక్ యాక్టివిటీస్ ఏంటేంటో ఒక లిస్ట్ ఉంటుంది. వాటిని ఆఫ్ చేయాలంటే.. మోర్ ఆప్షన్స్ అనే సెట్టింగ్‌ పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే మేనేజ్ ఫ్యూచర్ యాక్టివిటీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి టర్న్ ఆఫ్ చేయాలి. హిస్టరీ కూడా క్లియర్ చేసుకుంటే మంచిది.

అయితే.. వెబ్ బ్రౌజర్ లలో ఉండే క్లియర్ హిస్టరీ ఆప్షన్ అంత కచ్చితమైనదేమీ కాదిది. ఫేస్ బుక్‌ తో ఉన్న సంబంధాన్ని - అంతవరకు అది తీసుకున్న మన డాటాను తుడిచిపెట్టేయడం దీని వల్ల సాధ్యం కాదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఫేస్ బుక్ తన యూజర్లను ఎంతగా ట్రాక్ చేస్తుంది.. చివరకు దేశాల ఎన్నికలను సైతం ఎలా ప్రభావితం చేస్తుందన్నది గతంలో బయటపడిన విషయమే.

చివరగా దీనికి పరిష్కారం కావాలంటే రెండే రెండు ఆప్షన్లుంటాయి. ఒకటి.. ఫేస్ బుక్ పూర్తిగా వాడకపోవడం. రెండు.. ఫేస్‌ బుక్ యాప్ వినియోగించే ఫోన్ లో అది తప్ప ఇంకేదీ అంటే ఫోన్ బేసిక్ అవసరమైన కాల్ చేయడం వంటివి కూడా చేయకపోవడం.. బ్రౌజింగ్ అసలే చేయకపోవడం.. అసలా ఫోన్ లో ఫేస్ ‌బుక్ యాజమాన్యానిది కానీ ఇంకే యాప్ కూడా వాడకపోవడం. అంటే.. ఫేస్ బుక్ - ఇన్‌ స్టాగ్రామ్ - ఫేస్ బుక్ మెసేంజర్ కోసమే ఒక ఫోన్ పెట్టుకోవాలన్నమాట.

ఒక్క మాటలో చెప్పాలంటే మామూలుగా అన్ని పనులకూ వాడే ఫోన్లో ఫేస్ బుక్ యాప్ ఉంటే అది మీ కాల్స్ - బ్రౌజింగ్ - ఇతర యాప్‌లలో ఏం చేస్తున్నావు వంటివి చూడడమే కాకుండా ఫోన్ కెమేరా - మైక్రోఫోన్ సాయంతో మీ ఆఫ్ లైన్ యాక్టివిటీ కూడా మొత్తం చూస్తుంది - వింటుంది.
Tags:    

Similar News