టీడీపీ యువనేత - గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ కు సంబంధించి ఇప్పుడు ఓ ఆసక్తికర అంశం బాగానే వైరల్ అవుతోంది. పార్లమెంటులో ఏపీకి జరిగిన అన్యాయంపై గళం విప్పినందుకు తెలుగు తమ్ముళ్లు ఆయనకు ఘన సత్కారం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారట. నిన్నటిదాకా పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న జయదేవ్.. పార్లమెంటు తొలి విడత సమావేశాలు ముగిసిన నేపథ్యంలో గుంటూరు వచ్చేశారు. ఢిల్లీలో ఫ్లైటెక్కిన గల్లా జయదేవ్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత నేరుగా విజయవాడలో చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత ఆయన తన సొంత నియోజకవర్గం గుంటూరుకు బయలుదేరతారు. ఈ సందర్భంగా కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్య ఉన్న ప్రకాశం బ్యారేజీని వద్దే గల్లాకు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. అంతేకాదండోయ్... ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి మేళ తాళాలతో ధూంధాం చేసుకుంటూ సాగిన తమ్ముళ్లు... గల్లాను ర్యాలీగా గుంటూరు దాకా తీసుకెళ్లి... అక్కడ ఘన సత్కారం చేశారు. గల్లాకు తెలుగు తమ్ముళ్ల ఘన సత్కారానికి సంబంధించిన విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
పార్లమెంటు బెడ్జెట్ సమావేశాల్లో భాగంగా మొన్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సంబంధించిన ప్రస్తావనే లేకపోగా... ఏపీకి అన్యాయం జరిగిపోయిందని అప్పటిదాకా చాలా సైలెంట్‌గానే ఉన్న టీడీపీ ఎంపీలు గళం విప్పారు. ఆ గళం కూడా పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ తో పాటుగా *ఇలా మాట్లాడండి... అలా వ్యవహరించండి* అంటూ దిశానిర్దేశం చేసిన తర్వాత గానీ టీడీపీ ఎంపీలు గళం విప్పిన పాపాన పోలేదు. అయినా గడచిన మూడు బడ్జెట్‌లలో ఏపీకి ఏం న్యాయం జరిగిందని టీడీపీ ఎంపీలు నాడు గళం విప్పలేదన్న విషయాన్ని కాస్తంత పక్కనపెడితే.... సరే పార్టీ అధినేత నుంచి దిశానిర్దేశం జరిగింది కనుక వారంతా ఒక్కుమ్మడిగా కూడబలుక్కుని పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తున్నారు. మొత్తానికి ఏపీ తరఫున రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎంపీలుగా పోరాటం సాగించాల్సిన బాధ్యత టీడీపీ ఎంపీలపై లేదా? ఎందుకు లేదూ? అసలు పార్లమెంటుకు వారిని పంపింది... వారి ప్రజల సమస్యలపై గళం విప్పేందుకే కదా. మరి రాష్ట్ర ప్రజల తరఫున తన బాధ్యతగా మాట్లాడినందుకే గల్లాకు సన్మానాలు చేయాలా? అన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఇదిలా ఉంటే... అయినా గల్లా జయదేవ్ మాట్లాడిన నేపథ్యంలో రాష్ట్రానికి ఒరిగిందేమీ కూడా కనిపిస్తున్న దాఖలా లేదు. గల్లా జయదేవ్ మాట్లాడిన తర్వాత అదే సభలో మైకందుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ... అసలు ఏపీకి తాము ఏం చేశామన్న విషయాన్ని చెబుతూ పాత పాటే పాడారు తప్పించి.. గల్లా మాట్లాడినంతనే జైట్లీ ఏమీ జడిసిపోలేదు. తమ ఎంపీలు మాట్లాడిన తర్వాతే కేంద్రం దిగివచ్చిందని చెప్పుకుంటున్న టీడీపీ... గల్లా అండ్ కో పోరుతోనే కేంద్రం దిగివస్తే... మొన్నవెంకయ్యానాయుడు ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చిందో కూడా చెప్పాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. అయినా 10 లక్షల మందికి పైగా ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఓ ఎంపీ... ఆ పది లక్షల మంది గొంతుకను పార్లమెంటులో వినిపించడమే గొప్పతనమైతే.... ఇప్పటిదాకా ఎంతమందికి ఎన్నెన్ని సన్మానాలు చేయాల్సి ఉందో కూడా ప్రస్తావించుకోవాల్సిందే.
ఈ సందర్భంగా మరో ఆసక్తికర అంశాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. గల్లా జయదేవ్ కంటే ఓ రోజు ముందుగానే వైసీపీ యువనేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా పార్లమెంటులో తన వాణి వినిపించారు. మోదీ సర్కారును సూటిగానే ప్రశ్నించిన మిథున్ రెడ్డి చేసిన ప్రసంగం గల్లా ప్రసంగం కంటే కూడా చాలా మెరుగ్గానే ఉందన్న వాదన వినిపించింది. అయినా గల్లా మాదిరిగా మిథున్ రెడ్డి రాసుకొచ్చిన ప్రతిని చేతిలో పట్టుకుని చదవలేదు కదా. తమ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, టీడీపీ అవలంబిస్తున్న రెండు నాల్కల ధోరణిని మిథున్ రెడ్డి నిజంగానే కడిగిపారేశారని చెప్పాలి. అసలు పార్లమెంటులో ఇప్పుడు ఏ తరహా పరిస్థితి నెలకొందోనన్న అంశాన్ని కూడా గట్టిగానే ప్రస్తావించారు. తానుఅ నుకున్న విషయాన్ని చాలా సింపుల్ గానే కాకుండా విస్పష్టంగా మాట్లాడిన మిథున్ రెడ్డి... కేంద్రాన్ని దాదాపుగా ఇరుకున పెట్టారనే చెప్పాలి. ఆ మిథున్ రెడ్డి మాట్లాడిన మరునాడు మైకందుకున్న గల్లా... అంతకుముందే రాసుకుని తెచ్చుకున్న ప్రతిని అక్షరం ముక్క పొల్లు పోకుండా చదివారన్న వాదన వినిపించింది. సభాధ్యక్ష స్థానం వైపు చూస్తే... ఎక్కడ తన ప్రసంగం కట్టు తప్పిపోతుందోనన్న భయం కూడా గల్లా ప్రసంగంలో కనిపించిందన్న వాదన కూడా లేకపోలేదు. మరి ఈ మాత్రానికే గల్లాకు దండలేసి సత్కారాలు చేస్తామని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారంటే... అంతకంటే అత్యుత్సాహం ఏముంటుందన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.