ఏపీ అసెంబ్లీ స్పెషల్-2

Update: 2017-03-06 07:27 GMT
ఏపీ కొత్త అసెంబ్లీలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. దేశంలోని మరే రాష్ట్ర చట్టసభలకు లేని ప్రత్యేకతలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా మైకులు విరగ్గొట్టడం.. విసురుకోవడం.. కాగితాలు చింపి స్పీకర్ పై విసరడం..  వంటి అవకాశాలేవీ లేని విధంగా ఈ సభ భవన నిర్మాణశైలిని తీర్చిదిద్దారు.  మొత్తం సీసీ కెమేరాలతో నింపేశారు. సభా భవనం వెలుపల, లోపలా ప్రతి ఐదుఅడుగులకు ఒక సిసి కెమేరా. 1/3పిక్సెల్‌-20మీటర్‌ సామర్ద్యం ఉన్న డోమ్ కెమేరాలు.. 2మెగాపిక్సెల్‌ బుల్లెట్‌ కెమెరాలు - 20మీటర్ల కవరేజ్‌ కెపాసిటీ ఉన్న 360డిగ్రీల కెమెరాలు ఏర్పాటు చేశారు.
    
శాసనసభలో 231, మండలిలో 90 సీట్లు ఉన్నాయి.  శాసనమండలి చైర్మన్‌ పోడియం వెల్‌ లెవెల్‌ నుంచి 1.5మీటర్ల ఎత్తు ఉంది.   సీట్లు ముందుకు వెనక్కు జరిగేలా ఏర్పాట్లున్నాయి.  సౌండ్‌ రియాక్షన్‌ లేని విధంగా ఎకో విధానంలో సీలింగ్ ఏర్పాటు చేశారు.

ఇంకా ఏమున్నాయి..

* లేటెస్ట్‌ ఫైర్‌ ఫైటింగ్‌ వ్యవస్థ

* పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌

* డేటా సిస్టమ్‌ ఇంటర్నెట్‌ సి స్టం (అసెంబ్లి, శాసనమండలి సమావేశ మందిరాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో వై ఫై సదుపాయం)

* వీడియో కాన్ఫరెన్స్‌

* యాక్సెస్‌ కంట్రోల్‌ సిస్టమ్‌

* అన్ని వ్యవస్థల్ని ఒకేచోట నుంచి మానిటరింగ్‌ చేసే విధానం

* సెన్సార్‌ లైట్లు. ఎనర్జీ ఎఫిషిన్సీ లైట్లు

* అసెంబ్లి, శాసనమండలి హాళ్ళు, ఎమ్మెల్యే లాబీల్లో 700ఆర్కిటెక్చర్‌ ఫిట్టింగ్‌ ఎల్‌ఇడి లైట్లు. మిగిలిన భాగాల ఆవరణల్లో మొత్తం 1075 డౌన్‌లైటర్‌ ఎల్‌ఇడి లైట్లు.

* హీటింగ్‌ వెంటిలేషన్‌ ఎసి.

* అత్యాధునిక జర్మన్‌ టెక్నాలజీ ఆడియో వీడియో సిస్టమ్స్

* సెన్సార్లతో పని చేసే మైక్ లు

* లోపల జరిగే ప్రతి చిన్న కదలిక పరిశీలించేందు కు కంట్రోల్‌ రూమ్‌. దీనికి చీఫ్‌ మార్షల్‌ పర్యవేక్షణ

* సౌదీ నుంచి తెప్పించిన 20ఎమ్‌ఎమ్‌ మందం గల కార్పెట్లు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News