సోషల్ మీడియా వేదికగా జరిగే నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను సృష్టించి ఇతరలను మోసం చేయడమే లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమార్కులు లక్షలు వెనకేసుకుంటున్నారు. ఈ సైబర్ క్రైమ్స్ చేసేవారిని పట్టుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కూడా , వారు అంతకుమించి టెక్నాలజీని ఉపయోగించుకొని సులభంగా మోసం చేస్తున్నారు. తాజాగా ఏకంగా ఓ ఎమ్మెల్యే పేరుతోనే నకిలీ ఫేస్ బుక్ ప్రొఫైల్స్ సృష్టించి డబ్బులు లాగే ప్రయత్నం చేశారు. అయితే , ఆ మోసాన్ని త్వరగా పసిగట్టిన ఎమ్మెల్యే - అది నకిలీ సోషల్ మీడియా ఖాతా అని , దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలిసి కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే ... సోషల్ మీడియా సంస్థ అయిన పేస్ బుక్ లో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరుతో నకిలీ ఖాతా తెరిచారు సైబర్ మోసగాళ్లు. ఆ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత ఆ అకౌంట్ నుండి పలువురికి ఎమ్మెల్యే పేరుతో కొన్ని సందేశాలు పంపించారు. రూ. 15 వేలు డిపాజిట్ చేయాలని మెసేజ్ లు పంపారు. అయితే , ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అది నకిలీ ఫేస్ బుక్ ఖాతా అని, ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. నిందుతులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నగదు డిపాజిట్ చేయాలంటూ తన పేరుతో వచ్చే మెసేజ్ లను నమ్మవద్దని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు.