ఎప్పుడు కనిపించని లుక్ లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కనిపించాడు. మాసిపోయిన గడ్డం.. బాగా లావెక్కి కనిపించాడు. ధోని లుక్ ను చూసి అభిమానులు షాకవుతున్నారు. అసలు ధోనికి ఏమైంది..? అలా ఎలా అయ్యాడు.. ఏమైందనే ప్రశ్న అందరిలో మెదలుతోంది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. లాక్ డౌన్ నుంచి ధోని ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు. మార్చి నుంచి లాక్డౌన్ కారణంగా రాంచీలోని ఫామ్‌హౌస్ లోనే భార్యాపాపతో ఉంటున్నాడు.
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరమైన ధోనీ.. ఆ తర్వాత కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రాంచీలోని ఫామ్‌హౌస్‌లో ప్రస్తుతం ఉంటూ కుటుంబంతో గడుపుతున్నాడు. ఆ క్రమంలోనే ఫామ్ హౌస్ లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. స్వయంగా ట్రాక్టర్‌తో పొలం చదును చేస్తూ.. విత్తనాలు వేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు భార్య సాక్షి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కూతురు జీవాతో కలిసి బైక్‌పై ధోనీ తిరుగుతూ సంతోషంగా ఉంటున్నాడు.
అయితే ఆ ఫొటోలో కనిపించే ధోనిని చూసి ఆశ్చర్యపోతున్నారు. గడ్డం పెంచి.. ఆర్మీ కటింగ్ తో లావెక్కి కనిపించాడు. జూలై 7వ తేదీన ధోని జన్మదినం. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ధోని కామన్ డీపీ రూపొందించే పనిలో పడ్డారు. ట్విట్టర్ లో #DhoniBirthdayCDP హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.