నరసాపురం వాసులకు బంఫర్ ఆఫర్

Update: 2015-09-17 09:53 GMT
ఏపీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం నరసాపురం వాసులకు ఊహించని వరంగా మారనున్నాయి. ఆ మధ్యన ఏపీలోని అన్ని ఇళ్లకు రెండు ఎల్ఈడీ బల్బులను సరఫరా చేసిన ఏపీ ఇంధన శాఖ.. విద్యుత్తు వినియోగంలో భారీ ఆదా చేసిన విషయం తెలిసిందే. నామమాత్రపు ధరకు ఖరీదైన ఎల్ఈడీ బల్బుల్ని ఏపీలోని ప్రతి ఇంటికి రెండేసి చొప్పున సరఫరా చేశారు.

మామూలు బల్బుల స్థానంలో వీటిని వినియోగించటంతో ఏపీలో విద్యుత్తు ఆదా భారీగా ఉందని చెబుతున్నారు. ఎల్ఈడీ బల్బులతో పొదుపు చర్యలు విజయవంతం కావటంతో ఇప్పుడు.. గృహవినియోగంలో అత్యధిక విద్యుత్తు వినియోగం ఉండే ఫ్యాన్ లపై ఏపీ ఇంధన శాఖ దృష్టి కేంద్రీకరించింది. విద్యుత్తును ఆదా చేయటంలో భాగంగా నరసాపురంలోని ప్రతి ఇంటికి రెండేసి ఫ్యాన్లను పంపిణీ చేయనున్నారు. ఈ ఫ్యాన్ల వినియోగంతో విద్యుత్తు ఆదా అవుతుందని చెబుతున్నారు. ఇందుకోసం 60వేల ఫ్యాన్లు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా పంపిణీ చేసిన తర్వాత మూడు నెలల పాటు విద్యుత్తు వినియోగంలో వచ్చిన మార్పుల్ని అధ్యయనం చేసి.. తర్వాత దశలో వివిధ మున్సిపాలిటీలకు.. కార్పొరేషన్ లకు ఈ తక్కువ విద్యుత్తు వినియోగించే ఫ్యాన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఒక్కో ఇంటికి రెండేసి ఫ్యాన్ లు అంటే.. బంఫర్ ఆఫర్ కాకుండా మరేమిటి..?
Tags:    

Similar News