ప్రగతి భవన్ వద్ద రైతు ఆత్మాహత్యయత్నం
తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్ వద్ద కలకలం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన మల్లేష్ అనే రైతు మంగళవారం ఉదయం ప్రగతి భవన్ వద్దకు చేరుకొని పురుగుల మందు తాగాడు. అప్పుల బాధల వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మల్లేష్ ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.
వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మల్లేష్ వ్యవసాయంలో తీవ్ర నష్టాలను చవిచూశాడు. ఐదుసార్లు బోర్లు వేసినా.. నీళ్లు పడకపోవడంతో రెండు లక్షలకు పైగా అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని నెట్టుకురాకలేక తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. పరిష్కారం కానరాకపోవడంతో సీఎం కేసీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ చేరుకున్నాడు. అయితే స్థానికంగా ఉన్న అధికారులు అనుమతించకపోవడంతో క్యాంప్ కార్యాయలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు మల్లేష్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/