సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల సాగు - తాగు నీటి కష్టాలు తీర్చాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ఆగస్టు 15లోపు పూర్తి చేయాలని వడివడిగా ముందుకెళ్తున్నారు. ఇక సాగునీటి ప్రాజెక్టులు ఉరకలెత్తుతున్నాయి. ఎంత చేస్తే ఏం లాభం.. ఆ వరుణుడు కరుణించంది..
అవును నిజమే.. ఇప్పుడు తెలంగాణపై వరుణుడు ముఖం చాటేశాడు. వర్షాన్ని కొట్టనంటుంటున్నాడు. ఇప్పటికే ఖరీఫ్ పంటను రైతులు మొదలుపెట్టారు. మొలకలొచ్చి చిన్నగా ఎదిగాయి. ఈ సమయంలో వానలు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఈ సమయంలోనే ఎస్సారెస్పీ ఆయకట్టు కింద ఉన్న రైతులు తమకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. కానీ ప్రాజెక్టులోని నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే ఉందని.. నీరు విడుదల చేయలేమని అధికారులు - ప్రభుత్వం చెబుతోంది. కానీ రైతులు ఊరుకోవడం లేదు. నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో ఆదివారం గ్రామాలన్నీ ఏకమయ్యాయి. రైతులందరూ రోడ్లపైకి వచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. మొత్తం 21 గ్రామాల్లో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పికెట్ లు పెట్టి గ్రామస్థులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు నీటి కోసం రైతులు.. వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో నీటి యుద్ధం మొదలైంది.
తెలంగాణ నీటి కోసం కేసీఆర్ గతంలో ఆంధ్రానేతలు - ప్రజలపై యుద్ధం చేశారు. మా నీల్లు మాకే కావాలన్నారు. ఇప్పుడు అదే ఉద్యమస్ఫూర్తితో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న నిజామాబాద్ రైతులు మా ప్రాజెక్టు నీళ్లు మాకే కావాలంటున్నారు. మా పంటలను బతికించుకునేందుకు నీటిని వదలాలని డిమాండ్ చేస్తున్నారు.
వానలు పడితే అంతా ఓకే. కానీ పడకపోతే మాత్రం ఇలాంటి నీటి యుద్ధాలు అనివార్యం.. ఇప్పుడు మాది, మా నీళ్లు అని నినదిస్తున్న రైతులకు నాడు కేసీఆర్ ఆంధ్రానేతలతో కొట్లాడిన తీరే స్ఫూర్తి.. కేసీఆర్ పోరాడింది తప్పు కానట్లైతే.. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా రైతులదీ తప్పు కాదు..కానీ ప్రాజెక్టులో అడుగంటిన నీటికోసం రైతులు కోరడమే తప్పు. కనీసం తాగునీటి అవసరాలకు నీళ్లు లేకుండా సాగుకు ఇవ్వడం కరెక్ట్ కాదు.. ఏది ఏమైనా ఇప్పుడు నీటి లొల్లి మొదలైంది. కేసీఆర్ ఎన్ని ప్రాజెక్టులు, పథకాలు రూపొందించినా సరే.. వానలు పడకపోతే సీన్ రివర్స్ అని ఈ సంఘటన నిరూపించింది.