రిపబ్లిక్ డే పరేడ్ కు దీటుగా ట్రాక్టర్ల పరేడ్..రైతులు మరో కీలక నిర్ణయం!
దేశంలో రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఢిల్లీని దిగ్బంధనం చేసిన రైతులు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపినా సానుకూల ఫలితం రాలేదు. కేంద్రం దిగొచ్చేవరకు వెనక్కి తగ్గేదే లేదు అని రైతులు చెప్తుంటే .. చట్టాలకు కొన్ని సవరణలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.దేశంలో ఇప్పటి వరకూ జరిగిన ఉద్యమాల్లో ఇంత దీర్ఘకాలం పాటు లక్షలాది మంది పాల్గొన్న నిరసన కార్యక్రమం ఇదే.
కేంద్రం తెచ్చిన మూడు చట్టాలు ఏమిటి.. వాటిలో ఏమున్నాయనేది ఒకసారి చూస్తే.. అవి 1. మార్కెట్ల రద్దు చట్టం, 2. రైతు కార్పొరేట్ సంస్థతో ధరల ఒప్పంద చట్టం, 3.నిత్యావసర సరుకుల సవరణ చట్టం. వీటి ద్వారా రైతులకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ రక్షణలను తొలగించారు. కనీస మద్దతు ధర మాటే ఈ చట్టాల్లో చేర్చలేదు. దీనిపై రైతులు భగ్గుమంటూ కేంద్రం పై విరుచుకుపడుతున్నారు.
ఇక ఈ ఉద్యమంలో భాగంగా రైతు సంఘాలు రిపబ్లిక్ డే రోజు భారీ ఎత్తున నిరసనకు ప్లాన్ చేశాయి. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా ఢిల్లీలో పరేడ్ జరుగుతుంది. ఈ ఏడాది కూడా భారీ ఎత్తున పరేడ్ కు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు దీనికి పోటీగా మరో పరేడ్ నిర్వహణకు రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్ జరిగే సమయంలోనే ఢిల్లీ చుట్టూ భారీ ట్రాక్టర్ల పరేడ్ నిర్వహిస్తామని నేడు రైతుల సంఘాల నేతలు ప్రకటించారు. ఢిల్లీ చుట్టు పక్కల ఉండే రైతులు తమ ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో తరలి రావాలని, జనవరి 6న దీనికి రిహార్సల్ కూడా నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో పరేడ్ నిర్వహించి కేంద్రానికి తమ సత్తా చూపాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. జనవరి 4న కేంద్రంతో చర్చలు, జనవరి 5న సుప్రీంకోర్టు విచారణ తర్వాత కూడా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ట్రాక్టర్ల పరేడ్ నిర్వహించి తీరుతామని రైతులు వెల్లడించారు