ఫాదర్​ డ్యూటీ వచ్చేశా.. హార్దిక్​ పోస్ట్​

Update: 2020-12-13 07:31 GMT
యువ క్రికెటర్​ హార్దిక్​ పాండ్యాకు ఆస్ట్రేలియా టూర్​ ముగించికొని ఇంటికి వచ్చేశాడు. ప్రస్తుతం తన కొడుకు అగస్థ్యతో గడుపుతున్నాడు. అగస్థ్యకు  పాలు తాగిస్తున్న ఓ ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేసుకున్నాడు. ‘నేషనల్​ డ్యూటీ నుంచి ఫాదర్​ డ్యూటీకి’ అంటూ పోస్ట్​పెట్టాడు.

ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది. 2020ఐపీఎస్​ సీజన్​ కోసం పాండ్యా యూఏఈ వెళ్లాడు. తర్వాత ఆస్ట్రేలియా టూర్​కు ఎంపికకావడంతో నేరుగా ఆస్ట్రేలియా వెళ్లాడు. దాదాపు 5 నెలలు కుటుంబానికి దూరంగానే ఉన్నాడు.

టీ20 సీరిస్​లలో పాండ్యా చెలరేగి ఆడాడు. అతడిని టెస్టులకు దూరం పెట్టారు. దీంతో ఇండియాకు తిరిగిపయనమయ్యాడు. ప్రస్తుతం కుమారుడు అగస్త్యను అడిస్తున్నాడు. అయితే అగస్థ్యకు పాలు తాగిస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. మరోవైపు టీం ఇండియా క్రికెటర్లు టెస్ట్​ సీరీస్​కు సన్నద్ధమవుతున్నారు. ఈ సిరీస్​కు హిట్​మ్యాన్​ రోహిత్​ శర్మ వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు.

అయితే రోహిత్​ తొలి టెస్ట్​లో ఆడకపోవచ్చని సమాచారం. ఆయన ఆస్ట్రేలియా వెళ్లాక కొంతకాలం క్వారంటైన్​లో ఉండనున్నారు. ఆ తర్వాతే టెస్టులో ఆడతారు. ఆస్ట్రేలియా టూర్​లో భారత్​ వన్డే సీరిస్​ను 2-1తో ఓడిపోగా.. టీ20 సీరిస్​ను 2-1తో గెలుగుచుకున్నది.
Tags:    

Similar News