క‌శ్మీరీల బ‌రితెగింపు మ‌రీ ఇంత పెరిగిందట‌

Update: 2017-05-08 06:11 GMT
నా త‌ల్లి నుదిటి సింధూరం.. నా క‌శ్మీరం అన్న మాట‌ను త‌ర‌చూ ప‌లువురి భార‌తీయుల నోట వినిపిస్తూ ఉంటుంది. స‌రిగ్గా ఇదే మాట‌ను కాకున్నా.. క‌శ్మీర్ త‌మ‌ద‌న్న బావ‌న‌ను క‌న్యాకుమారి నుంచి జ‌మ్మూ వ‌ర‌కూ అంద‌రూ అనుకుంటారు. అయితే..క‌శ్మీర్ లో ఎలాంటి ప‌రిస్థితి ఉంది? అక్క‌డి ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఏముంది? అన్న ప్ర‌శ్న‌లు వేసుకుంటే వ‌చ్చే స‌మాధానాన్ని చాలామంది భార‌తీయులు జీర్ణించుకోలేరు. ఇదంతా కూడా సుదీర్ఘ కాలం పాటు ప్ర‌భుత్వాలు.. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చేసిన త‌ప్పులే క‌శ్మీరీలు ఇలా ఉండ‌టానికి కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

నిజానికి.. క‌శ్మీరీల్లో నెల‌కొన్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించటం క‌ష్ట‌మైన‌దేం కాదు. కానీ.. చిత్త‌శుద్ది.. నిజాయితీగా ప‌ని చేస్తే.. కొద్ది కాలానికే క‌శ్మీరీల మైండ్ సెట్ ను మొత్తంగా మార్చేయొచ్చు. ఇటీవ‌ల కాలంలో క‌శ్మీర్ వ్యాలీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఆందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి. తాజాగా ఇదెంత పీక్ స్టేజ్ కి వెళ్లింద‌న్న‌ది తాజా ఉదంతాన్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇటీవ‌ల భ‌ద్ర‌తా బ‌ల‌గాల చేతిలో హ‌తమైన ఒక మిలిటెంట్ల విష‌యంలో.. అక్క‌డి స్థానికులు వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రిపై తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇటీవ‌ల హ‌త‌మైన ఉగ్ర‌వాది ఫ‌యాజ్ అహ్మ‌ద్ అలియాస్ సిదా అంత్య‌క్రియ‌ల సంద‌ర్బంగా బ‌రితెగింపు స్ప‌ష్టంగా క‌నిపించింది. అత‌డి అంత్య‌క్రియ‌ల్లో స‌హ‌చ‌ర ఉగ్ర‌వాదులు బాహాటంగా పాల్గొన‌ట‌మే కాదు.. త‌మ స‌హ‌చ‌రుడికి ఏకే 47 తుపాకుల‌తో గ‌న్ సెల్యూట్ చేసిన వైనం క‌ల‌క‌లం రేపుతోంది. దాదాపు న‌లుగురు ఉగ్ర‌వాదులు అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యార‌ని.. భార‌త్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు ఇచ్చి.. భ‌ద్ర‌తా సిబ్బంది చేరుకునేలోపే ప‌రారైన‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు.

అంత్య‌క్రియ సంద‌ర్భంగా నిర్వ‌హించిన యాత్ర‌లో ప‌లువురు పాల్గొన‌టం.. భార‌త్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌టంపై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి వాటికి చెక్ చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. వెంట‌నే.. ఇలాంటి ప‌రిస్థితుల్ని కంట్రోల్ చేసేందుకు యుద్ద‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌ల్ని చేప‌ట్టాల్సి ఉంద‌ని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News