అక్కడ గబ్బిలాలు ఎందుకు చనిపోయాయంటే ?

Update: 2020-05-07 14:30 GMT
దేశంలో కరోనా మహమ్మారి అందరిని భయపెడుతున్న సమయంలో గబ్బిలాలు గుంపులు గుంపులుగా మృత్యువాత ఓ గ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ‌లో చోటుచేసుకుంది. మీరట్‌ శివారులోని మెహ్రోలీ గ్రామ సమీపంలోని నీటి గుంటలో ఏప్రిల్‌ 29న గబ్బిలాల కళేబరాలు బయటపడ్డాయి. అయితే, ప్రస్తుతం అందరిని భయంతో వణికిపోయేలా చేస్తున్న ఈ మహమ్మారి చైనా లో గబ్బిలాల నుండే వ్యాప్తినిచ్చింది అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు.

ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారి అదితి శర్మ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బరేలిలోని ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐవీఆర్ ‌ఐ)కి గబ్బిలాల నమూనాలు పంపించారు. ఇక ఈ విషయంపై పరిశోధన జరిపిన ఐవీఆర్ ‌ఐ శాస్త్రవేత్తలు కరెంట్‌ షాక్‌ తగిలినందు వల్లే గబ్బిలాలు మృత్యువాత పడ్డాయని తాజాగా స్పష్టం చేశారు.

ఈ విషయం గురించి డీఎఫ్‌ ఓ అదితి శర్మ మాట్లాడుతూ.. నీటి కుంట సమీపంలోని పండ్ల తోటలో వెదజల్లిన రసాయనాల వల్లే గబ్బిలాలు చనిపోయినట్లు భావించామని.. అయితే ఎలక్ట్రిక్‌ షాక్‌ వల్లే ఘటన జరిగిందని, కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ మెహ్రోలి గ్రామస్తులు మాత్రం అదితి మాటలతో ఏకీభవించడం లేదు. ఊరి పెద్ద గంగారాం ఘటన గురించి మాట్లాడుతూ గబ్బిలాల మృతదేహాలు లభించిన చోటుకు సమీపంలో ఎలాంటి కరెంట్‌ లైన్‌ లేదని తెలిపారు. షాక్‌ కొట్టడం వల్లే అవి చనిపోయాయని చెబుతున్నారని, అయితే అక్కడే ఉన్న ఇతర జంతువులు ఎందుకు చని పోలేదని ప్రశ్నించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యం లో ఈ ఘటన పై లోతుగా విచారణ జరిపాలని విజ్ఞప్తి చేశారు.
Tags:    

Similar News