వేధించినోడిది కోసి ప‌డేసింది!

Update: 2018-12-27 05:51 GMT
పెళ్లై..పిల్ల‌లు ఉండి త‌న మానాన తాను బ‌తుకుతున్న ఒక మ‌హిళ‌కు ప్రేమ పేరుతో వేధిస్తున్న ఒక‌డికి ఊహించ‌లేని షాకిచ్చిందో మ‌హిళ‌. ప్రేమ‌.. ప్రేమ అంటూ వేధించ‌ట‌మే కాదు.. భ‌ర్త ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. నీ పెళ్లాన్ని ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానంటూ ఓవ‌రాక్ష‌న్ చేసినోడికి గుణ‌పాఠం చెప్పిన మ‌హిళ తీరు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.  ముంబైలో జ‌రిగిన ఈ ఉదంతం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ముంబ‌యి మ‌హాన‌గ‌రంలోని డోంబివ‌లికి చెందిన 47 ఏళ్ల వివాహిత‌కు భ‌ర్త‌.. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. త‌న మానాన తాను బ‌తుకుతున్న ఆమెకు పొరుగింట్లో ఉంటున్న 27 ఏళ్ల తుషార్ పుజారే కొత్త త‌ల‌నొప్పిగా మారాడు. ఇళ్ల‌కు లోన్ ఇచ్చే ఉద్యోగం చేసుకునే అత‌గాడు.. వివాహిత‌ను ప్రేమిస్తున్న‌ట్లుగా మాట‌లు చెబుతూ.. ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని చెబుతూ వేధించ‌టం షురూ చేశాడు.

త‌న బ‌తుకు తాను బ‌తుకుతున్నాన‌ని.. ప్రేమ లాంటివేమీ లేవ‌ని స‌ద‌రు వివాహిత చెప్పినా విన‌ని ప‌రిస్థితి. అంతేనా.. వివాహిత భ‌ర్త వ‌ద్ద‌కు వెళ్లి.. మీ భార్య‌ను ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటాన‌ని నేరుగా చెప్ప‌టంతో ఆమె ప‌రిస్థితి దారుణంగా మారింది. అప్ప‌టి నుంచి ఎదురింటోడి వేధింపుల‌తో పాటు.. భ‌ర్త అనుమానం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేయ‌టం మొద‌లెట్టాయి.

త‌న‌ను ఇంత‌గా ఇబ్బంది పెడుతున్న తుషార్ కు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని భావించిన ఆమె.. త‌న‌కు తెలిసిన ఇద్ద‌రు యువ‌కుల సాయంతో ఒక ప్లాన్ వేసింది. ఇంటి లోన్ కావాల‌ని చెబుతూ.. త‌న‌కు తెలిసిన వారి చేత ఫోన్ చేయించి పిలిపించారు. లోన్ గురించి మాట్లాడేందుకు ఇంటికి వెళ్లిన తుషార్ ను వివాహిత‌.. మ‌రో ఇద్ద‌రు క‌లిసి బ‌డిత పూజ చేశారు. త‌న‌ను తీవ్రంగా వేధిస్తున్న అత‌డి పుర‌షాంగాన్ని క‌త్తితో కోసేసింది.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న అత‌డ్ని.. స్నేహితుల‌తో క‌లిసి ఆసుప‌త్రిలో చేర్పించారు. తుషార్ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. కోసేసిన క‌త్తిని.. అందుకు కార‌ణ‌మైన వివాహిత‌ను.. ఆమెకు స‌హ‌క‌రించిన ఇద్ద‌రు యువ‌కుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని.. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేస్తున్నారు. పెళ్లైన మ‌హిళ‌ల్ని వేధించే పోకిరీల‌కు త‌గిన‌ శాస్తి చెప్పిన వివాహిత ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. పురుషాంగాన్ని కోసేసిన వైనంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News