హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన ఒక మహిళా ఐటీ ఉద్యోగినికి ఎదురైన పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదు. ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితి తెలిస్తే అయ్యో అనుకోకుండా ఉండలేం. ఎవరో తెలీకుండా ఆమెను టార్గెట్ చేసిన వైనం అర్థమవుతున్నా.. దాన్ని సీరియస్ గా తీసుకొని వాడి సంగతి పట్టే పరిస్థితి లేకపోవటంతో ఆమె నిస్సహాయంగా మారిపోవటమే కాదు.. మౌనంగా రోదిస్తోంది.
చివరకు తన కెరీర్ ను సైతం బలి చేసుకుంది. ఆమె ఉదంతం మొత్తం విన్నంతనే ఉలికిపాటుకు గురయ్యేలా ఉంటుంది. ఉప్పల్ కు చెందిన 33 ఏళ్ల ఒక మహిళ ఐటీ కంపెనీలో పని చేస్తుంది. ఎప్పటిలానే ఆఫీసుకు వెళ్లిన ఆమెకు.. కోలీగ్ చెప్పిన మాట విన్నంతనే అవాక్కు కావటమే కాదు.. కాళ్ల కింద భూమి కదిలిపోయిన పరిస్థితి. ఆమె పేరును గూగుల్ లో సెర్చ్ చేసిన వెంటనే.. పోర్న్ వెబ్ సైట్ల లింకులు ఓపెన్ అవుతున్నాయి.
దీంతో ఆమె వెంటనే సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. చర్యలు తీసుకుంటామని చెప్పినా.. ఎలాంటి ఫలితం లేదు. ఈ విషయం అంతకంతకూ తెలిసిపోతూ.. ఆఫీసులో ఆమె తీవ్ర ఇబ్బందులకు గురి అవుతోంది. సహోద్యోగుల నుంచి హేళనల నేపథ్యంలో ఆఫీసుకు వెళ్లలేక.. జాబ్ కు రిజైన్ చేసింది. తనకు ఎదురైన దారుణ పరిస్థితిపై గూగుల్ కు నోటీసులు పంపినా.. తామేం చేయలేమంటూ చేతులు ఎత్తేటంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆమె చిక్కుకుంది.
తన పేరును సెర్చ్ చేసినంతనే పోర్న్ సైట్లు ఓపెన్ కావటంపైన సదరు సైట్ల నిర్వాహకులకు.. వెబ్ హోస్ట్ ప్రొవైడర్లకు నోటీసులు పంపారు. అయితే.. పోర్న్ సైట్ల నుంచి పేరు తొలగించటం తమ చేతుల్లో లేదని గూగుల్ స్పష్టం చేయటంతో.. ఏం చేయాలో అర్థం కాక వేదనకు గురి అవుతోంది. ఈ దారుణ పరిస్థితి రెండేళ్లుగా అనుభవిస్తున్న సదరు మహిళ పరిస్థితి తలుచుకుంటేనే వణుకు పుట్టటం లేదు?