వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..ఏంటంటే?

Update: 2020-05-26 10:50 GMT
ఈ మహమ్మారి కారణంగా స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలను వీలైనంత తొందరగా మళ్లీ పట్టాలెక్కించాలనే భావనలో ఉన్న ఏపీ సర్కార్...తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మరి కొన్నింటికి లాక్ ‌డౌన్‌ నిబంధనల నుంచి సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నగలు - బట్టలు - చెప్పులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అదే సమయంలో ఆయా షాపులు పాటించాల్సిన విధి విధానాలపై సర్క్యులర్ జారీ చేసింది.

అలాగే రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారికి కూడా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. స్ట్రీట్ ఫుడ్స్‌ సైతం తెరిచి ఉంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇకపై రోడ్లపై ఆహారం అమ్మేవారు ప్లేట్స్ రూంలో కాకుండా పార్సిల్ సదుపాయం కల్పించాలని ఆదేశాల్లో తెలిపారు. ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న వారు ఆహార విక్రయ బండ్లను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. అయితే , పానీపూరి బండ్లకి మాత్రం అనుమతి ఇవ్వలేదు.

ఇకపోతే , పెద్ద షోరూమ్‌ లకు వెళ్లాలంటే ముందే ఆన్ ‌లైన్ ‌లో అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అన్ని షాపుల్లో ట్రైల్‌ రూమ్‌ లకు అనుమతిని నిరాకరించింది. వీటితో పాటు నగల షాపుల్లో విక్రయించే వారు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల్లో తెలియజేసింది.
Tags:    

Similar News