దళితబంధుపై మొదలైన లొల్లి

Update: 2021-08-14 11:15 GMT
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దళితబంధు' పథకం వివాదం రేపుతోంది. హుజూరాబాద్ బైపోల్ కోసం ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పథకం తీసుకొచ్చింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో అమలు చేస్తున్నారు. హుజూరాబాద్ లో అమలు కు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు 'దళితబంధు' కావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.  కొందరు ఏకంగా నిరసనకు దిగుతున్నారు. తమకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో దళితబంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కొందరు స్థానికులు పురుగుల మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దళితులు దగ్ధం చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  కానీ తమపై ఎందుకు వివక్ష చూపిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

దళితబంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ తో ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ లోని బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందాలని దయాకర్ మాదిగ అంటున్నారు. లేదంటే సెప్టెంబర్ 5న హుజూరాబాద్లో దళిత గర్జన సభ నిర్వహించి ఆందోళన చేపడుతామన్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ ఈ నెల 31 లోపు దళితబంధు పథకం ద్వారా రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హసన్ పర్తి మండలం కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ నేతలు దీక్షలు చేపట్టారు. ఉప ఎన్నికలకు ముందే రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.  కాజిపేటలోనే నిరసనలు మొదలయ్ాయి. హన్మకొండలోనూ రిలే దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలోనే దళితబంధు ఎఫెక్ట్ కేసీఆర్ సర్కార్ కు గుదిబండగా మారే ప్రమాదం ఉంది.
Tags:    

Similar News