కొన్ని అంశాలు కంటికి కనిపించినా అవగాహన లేకపోవటం.. తగిన సమాచారం చేతిలో ఉండకపోవటం.. తెలిసిన తప్పుపై పోరాటం చేసేందుకు ఏం చేయాలో తెలియకపోవటం లాంటి కారణాలతో చాలాసార్లు వెనక్కి తగ్గే దుస్థితి. అడ్డదిడ్డంగా ప్రచారం చేస్తూ.. మాయ మాటలతో యాడ్స్ తయారు చేసే కంపెనీలు చాలానే ఉన్నా.. వారు చేసే మోసాల్ని ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని పరిస్థితి.
ఇలాంటి ఇబ్బందిని అధిగమించటంతో పాటు.. చేతిలో ఉన్న మొబైల్ తో సదరు కంపెనీల తాట తీసేందుకు తాజాగా ఒక సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎన్ సీఐ) సంస్థ తాజాగా ఒక వాట్సప్ అకౌంట్ ను స్టార్ట్ చేసింది. ఇందుకోసం ఒక నెంబరును విడుదల చేసింది. ఈ వాట్సప్ నెంబరు ద్వారా ఏఎన్ సీఐకి ఫిర్యాదు చేసే వీలు కలుగుతుంది.
మోసపూరిత ప్రకటనల తాట తీసేందుకు వీలుగా ఈ నెంబరు సాయం చేయనుంది. ప్రింట్ యాడ్స్ కానీ.. హోర్డింగ్ మీదున్న ఫోటోలు.. వెబ్ షాట్స్.. యూట్యూబ్ వీడియో లింకులు ఇలా ఒకటేమిటి.. ఇష్టారాజ్యంగా మాయ చేసే కంపెనీలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ చేసేందుకు వీలుగా ఈ సంస్థ వాట్సప్ నెంబరును విడుదల చేసింది. దీంతో ఫిర్యాదు చేయొచ్చని.. తప్పుదారి పట్టించే ప్రకటనలు రూపొందించే కంపెనీల మీద చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.
ఇంతకీ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన వాట్సప్ నెంబరు ఏమిటంటే.. +91 77-100-12345.