ఆర్థిక నేరాల్లో మరో టీడీపీ నేత

Update: 2016-10-18 17:06 GMT
టీడీపీకి చెందిన కేంద్ర మంత్రిపై ఇప్పటికే బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ఆరోపణలున్నాయి.. ఇది చాలదన్నట్లుగా మరో టీడీపీ నేత - ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి కూడా అలాంటి కేసులోనే చిక్కుకున్నారు.  అది కూడా ఏకంగా 720 కోట్ల వ్యవహారం. దీంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆ నేత ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేరని.. పరారీలో ఉన్నారని చెబుతున్నారు.

పారిశ్రామికవేత్త అయిన నారాయణరెడ్డి కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్సీగా గెలిచినా కూడా ఆ తరువాత టీడీపీలో చేరారు. వివిధ ఆర్థిక సంస్థలు - బ్యాంకుల నుంచి ఆయన భారీగా రుణాలు తీసుకున్నారట. వాటిని కొద్ది నెలలుగా చెల్లించకపోవడంతో వారంతా ఇప్పుడు ఆయన కోసం వెతుకుతున్నారు. పలు సంస్థలు ఆయన ఆస్తులు వేలం వేయడానికి కూడా రెడీ అవుతున్నాయి. ఒక్క స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకే ఆయన ఏకంగా 203కోట్లు తిరిగి చెల్లించాలట. దీంతో ఆ బ్యాంకు తాజాగా బహిరంగ ప్రకటన జారీ చేసింది. కాగా వాకాటికి రాష్ట్రంలో పేరు మోసిన సంస్థలున్నాయి. వీఎన్ ఆర్ ఇన్ ఫ్రా - లాజిస్టిక్సు - పవర్ టెక్ - అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ వంటి సంస్థలున్నాయి.  అధికార పార్టీలోకి వస్తే అప్పులు ఎగ్గొట్టొచ్చని ఆయన ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారని రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News