ఎల్‌పీ.. బ్లాస్ట‌యినా.. కొడాలి నాని మౌనం.. రీజ‌నేంటి?

Update: 2022-09-29 09:34 GMT
ఫైర్‌బ్రాండ్.. వైసీపీ నాయ‌కుడు.. కొడాలి నాని.. ఇప్పుడు ఊహించ‌ని మౌనాన్ని పాటిస్తున్నారు. రాజ‌కీయం గా.. వైసీపీపైనా, సీఎం జ‌గ‌న్‌పైనా ఎవ‌రు ఏమ‌న్నా.. ఆయ‌న విరుచుకుప‌డతారు. నిప్పులు చెరుగుతారు.. అలాంటి నాయ‌కుడు..ఇప్పుడు.. రాష్ట్రంలో ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీకి పేరు మార్పు త‌ర్వాత‌.. రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేగింది. అటు వైపు నుంచి ఎన్టీఆర్ కుటుంబం.. ఇటువైపు నుంచి వైసీపీ మంత్రులు..నాయ‌కులు కూడా.. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ఇక‌, ఎన్టీఆర్ స‌తీమ‌ని ల‌క్ష్మీ పార్వ‌తి(ఎల్‌.పీ) కూడా బ్లాస్ట్ అయ్యారు. యూనివ‌ర్సిటీ పేరు మార్పు చిన్న ద‌న్న‌ట్టుగా చూశారు. మ‌రి ఇంత‌జ‌రిగినా.. కీల‌క‌మైన నాయ‌కుడు.. అసెంబ్లీలో ఆయ‌న ప్ర‌సంగం కోసం.. సీఎం జ‌గ‌నే ఎదురు చూసే ప‌రిస్థితి ఉన్న నాయ‌కుడు.. కొడాలి నాని.. ఎందుకు మౌనంగా ఉన్న‌ట్టు అనేది ప్ర‌శ్న‌.

దీనిపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న మౌనం వెనుక సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న ఆవేద‌న గా ఉన్నార‌ని.. పేరు మార్పును జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని చెబుతున్నారు.

ఎందుకంటే.. ఎప్పుడు చంద్ర‌బాబును కౌంట‌ర్ చేయాల‌న్నా.. కార్న‌ర్ చేయాల‌న్నా.. కొడాలి నాని.. 'ఆ మ‌హానుభావుడు రామారావుగారు'' అంటూ.. మొద‌లు పెట్టి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసేవారు. అయితే.. ఇప్పుడు ఆ పేరును ఎత్తే అవ‌కాశం లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంద‌. ఇక‌, ఆపేరుతో ఆయ‌న చంద్ర‌బాబుకు కౌంట‌ర్ ఇవ్వ‌లేని ప‌రిస్థితి తెచ్చార‌ని అంటున్నారు. ఇక‌, మ‌రోవైపు.. జిల్లాకు పేరు పెట్టి.. యూనివ‌ర్సిటీకి తీసేయ‌డంపైనా.. ఆయ‌న ఆవేద‌న‌తోనే ఉన్నారు.

ఈ ప‌రిణామాల‌కు తోడు.. త‌న‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించార‌నే ఆవేద‌న‌కూడా ఉంది. ఇక‌, క‌మ్మ సామాజిక వ‌ర్గంలో త‌న‌ను దూరంగా పెట్ట‌డం.. కూడా ప్ర‌బుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల కార‌ణంగానే అనే విష‌యాన్ని ఆయ‌న త‌ర‌చుగా.. ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు. వీటికితోడు.. జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అవుతున్నామ‌నే భావ‌న కూడా ఆయ‌న‌లో ఉంద‌ని అంటున్నారు.

ఈ ప‌రిణామాల‌తోనే.. ఆయ‌న త‌ర‌చుగా.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా డుమ్మా కొడుతున్నార‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. ల‌క్ష్మీపార్వతి మాట్లాడిన త‌ర్వాత‌.. కూడా కొడాఆలి నోరు విప్ప‌క‌పోవ‌డం.. అన్న‌గారికి జ‌.రిగిన అవ‌మానం అని.. అంద‌రూ అంటుంటే.. ఆయ‌న మౌనంగా ఉండ‌డంవంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News